Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి.. వ‌ర్సెస్‌.. సీబీఎన్ మైండ్ సెట్స్ మారాయా? లింకేంటి?

By:  Tupaki Desk   |   30 May 2022 2:30 PM GMT
రాజ‌మౌళి.. వ‌ర్సెస్‌.. సీబీఎన్ మైండ్ సెట్స్ మారాయా?  లింకేంటి?
X
సినిమాల‌లో రాజ‌మౌళి అంటే ఒక క్రేజ్‌. ఒక క్రియేటివ్ సినిమా డైరెక్ట‌ర్‌. ప్ర‌పంచంలోనే ఇప్పుడు ఉన్న పెద్ద డైరెక్ట‌ర్ల‌లో ఒక పేరు కూడా సొంతం చేసుకున్నారు. ఇక‌, టాలీవుడ్‌ను హాలీవుడ్ స్థాయికి తెచ్చిన వ్య‌క్తి. అలానే.. టీడీపీ అధినేత, మాజీసీఎం చంద్ర‌బాబు అంటే.. హైద‌రాబాద్‌ను, సైబ‌రాబాద్‌ను తీర్చిదిద్ది.. అంత‌ర్జాతీయ స్థాయికి తెచ్చిన‌.. హైకెట్ పొలిటీషియ‌న్‌. విజ‌న్ ఉన్న వ్య‌క్తి. సైబ‌రాబాద్ సృష్టిక‌ర్త కూడా. ఈరోజు హైద‌రాబాద్ అంటే.. చంద్ర‌బాబు అనే చెప్పాల్సిన ప‌రిస్థితి.

ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రూ.. ఈ మాట‌నేచెబుతారు. ఇష్టం ఉన్నా లేకున్నా.. ఈ మాట‌నే ఒప్పుకొంటారు. ఎందుకంటే.. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ ఈ రోజు సెకండ్ హైఎస్ట్ డాటా సెంట‌ర్‌ను హైద‌రాబాద్‌లో పెడుతున్నారు అంటే.. అది గ‌త ముఖ్య‌మంత్రిగా.. చంద్ర‌బాబు కృషి వ‌ల్లే అంటే.. అతిశ‌యోక్తికాదు. తెలంగాణ‌కు ఈ రోజు హైద‌రాబాద్ నుంచి దాదాపు 40 శాతం ఆదాయం వ‌స్తోంది అంటే.. అది కూడా చంద్ర‌బాబు చేసిన కృసి అని అంద‌రూ అంటారు.. ఒప్పుకొంటారు కూడా!

ఇంత‌కీ టైటిల్‌లో ఉన్న రాజ‌మౌళి వ‌ర్సెస్ చంద్ర‌బాబు అని పోలిక ఏంటంటే.. వాళ్ల మైండ్ సెట్ మారిపోయాయా? అంటున్నారు. రాజ‌మౌళి బాహుబ‌లి 1లో త‌మ‌న్నాను భారీ ఎక్స్‌పోజ్ చేశారు. సాంగ్ తీశారు. దీంతో ఎన్నారైలు.. చాలా మంది రాజ‌మౌళి కూడా ఎక్స్ పోజింగ్ లేకుండా.. తీయ‌లేడా? అని ట్రోల్ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున టీవీ డిబేట్స్ కూడా అయ్యాయి. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ, మ‌హిళ‌లు.. రాజ‌మౌళి ఒక లెవిల్‌లో తీశాడ‌ని.. ఊహించుకుంటారు. కానీ, త‌మ‌న్నా సాంగ్‌తో అత‌ని మీద పెద్ద‌గా అంద‌రి మాదిరిగానే ఆయ‌న ఒక డైరెక్టర్ అని అంటున్నారు.

అలానే.. చంద్ర‌బాబు కూడా ఇప్పుడు నోరు జారారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఎప్పుడూ.. చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడుతూ.. ఉంటారు. ఆయ‌న ప‌ద‌జాలం. వ్యాఖ్య‌లు కూడా చాలా గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటాయి. దిగ‌జారుడు వ్య‌వ‌హారం ఎప్పుడూ చేయ‌లేదు. ఒక‌క‌వేళ రాజ‌కీయంగా ఎవ‌రైనా.. తిట్టినా.. చంద్ర‌బాబే.. ప‌దాలు జాగ్ర‌త్త అంటూ.. హెచ్చరిస్తుంటారు. అలాంటి చంద్ర‌బాబు.. లోకేష్ త‌న‌కు తానే.. స‌ర్టిఫికేట్ ఇచ్చుకుంటూ.. నేను మూర్ఖుడిని.. అని అంటే.. మాట స‌రిచేసుకోవాలి.. అని చెప్తే.. మొన్న జ‌రిగిన మ‌హానాడులో లోకేష్ నోరు జార‌కుండా.. జాగ్ర‌త్త ప‌డ్డాడు.

కానీ, టీడీపీ మ‌హిళా నేత‌లు, పురుష నేత‌లు కూడా.. మాట్లాడ‌ని లాంగ్వేజ్‌.. వాడార‌ని అంటున్నారు. అంటే.. స‌భ్య స‌మాజం లో వాడ‌ని ప‌దాల‌ను వారు వాడారు. అంటే అది చంద్ర‌బాబు నియంత్రించ‌లేక లోలోప‌లే కుమిలిపోయార‌ని.. టీడీపీలో నాయ‌కులు వ్యాఖ్యానించారు. చాలా మంది చండాల‌మైన ప‌దాల‌ను వాడార‌ని.. చంద్ర‌బాబు కూడా అలాంటి భాష‌ను ఎంక‌రేజ్ చేయ‌డం ఏంట‌ని అంటున్నారు.

అధికార పార్టీ వైసీపీలో ఉన్న‌మాజీ మంత్రి వాడిన భాష‌తో సీఎం జ‌గ‌న్ మొద‌ట్లో కొంచెం ఎంజాయ్ చేసినా.. త‌ర్వాత‌.. ఆయ‌న వాడే బూతులతో ఏకంగా.. మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున బూతుల మంత్రి అనిపేరు ప‌డిపోయింది. అందుకే.. జ‌గ‌న్ ఆయ‌న‌ను తీసేశార‌ని అంటున్నారు. కాబ‌ట్టి.. భాష చాలా ముఖ్యం అని అంటున్నారు. ఇలాంటి దుర్భాష‌లు.. కేవలం సోష‌ల్ మీడియాలో అప్ప‌టిక‌ప్పుడు హైలెట్ అయ్యేందుకు ప‌నికి వ‌స్తుంది కానీ, లాంగ్ ట‌ర్మ్ లో తీసుకుంటే.. ప‌నికిరాద‌ని అంటున్నారు.