Begin typing your search above and press return to search.
ప్రధాని ఆశ కూడా పోయినట్లే
By: Tupaki Desk | 18 Aug 2015 1:04 PM GMTఅధికారం చేతికి వచ్చినప్పుడు ప్రజారంజకంగా పాలించటం మాని.. తనకు తిరుగులేదన్నట్లుగా ఉండటం.. అహంభావంతో వ్యవహరించటం ఎంతటి ముప్పు అన్న విషయం శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే కు తాజాగా బాగానే తెలిసి వచ్చి ఉంటుంది. శ్రీలంక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో రాజపక్సే వైఖరికి.. ఆ తర్వాత ఆయన వ్యవహారశైలికి ఎంత మార్పు వచ్చిందో.. శ్రీలంక రాజకీయాల్ని నిశితంగా గమనించిన వారికి తెలిసిన విషయమే.
తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. తనకు ప్రత్యర్థులైన వారిని అణగదొక్కటం.. నియంతృత్వ పోకడలు ప్రదర్శించటాన్ని లంకేయులు తీవ్రంగా వ్యతిరేకించటమే కాదు.. ఆయన్ను అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యేలా చేశారు.
అధ్యక్ష పదవి చేజారిన తర్వాత.. తన పరువును నిలబెట్టుకోవాలన్న ఆశతో ప్రధానమంత్రి పదవి కోసం ఆయన విఫలయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు రావటానికి ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ విజయం సాధిస్తుందన్న విషయాన్ని ఆయన స్వయంగా ఒప్పుకోవటం ఒక విశేషం.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రధానిగా విక్రమ సింఘే మరోసారి ప్రధాని అయ్యే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
ఎల్టీటీఈని సమూలంగా నాశనం చేయటంలో విజయవంతంగా వ్యవహరించినప్పటికీ.. ఆ తర్వాతి రోజుల్లో ఆయన తనకు తాను తిరుగులేని నేతగా భావించటం.. అహంకారంతో వ్యవహరించి పలు విమర్శలు ఎదుర్కొన్నారు. తనకు తీవ్రమైన ప్రతికూలత ఎదురవుతున్నా పట్టని ఆయన.. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ముందస్తుకు వెళ్లటం..దీనికి లంకేయులు ముఖం పగిలేలా తీర్పు ఇచ్చి.. కుర్చీ నుంచి దింపేయటంతో రాజపక్సే శకం ముగిసింది. ప్రధానిగా అయిన పదవిని చేపట్టొచ్చన్న దింపుడుకళ్లెం ఆశలకు లంకేయులు నో చెప్పేయటంతో.. తన కల తుడిచి పెట్టుకుపోయిందని నిరాశగా ఆయన వ్యాఖ్యానించటం చూస్తేనే.. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందన్నది తెలిసిపోతుంది. అహంకారంతో ఎగిసెగిసిపడిన వారు ఎవరైనా సరే.. కాలం ముందు తల వంచక తప్పదన్న సత్యం మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.