Begin typing your search above and press return to search.
బీజేపీ ఎలా వదులుకుంటుంది.. 'రాజా'!
By: Tupaki Desk | 24 Aug 2022 11:38 AM GMTతనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వీలైనంత త్వరగా షోకాజ్ నోటీసులపై సమాధానం ఇస్తానని తెలిపారు. తన వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ తనను వదులుకోదని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు పూర్తి నమ్మకముందని అన్నారు.
తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడనని తెలిపారు. మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కుంటానని చెప్పారు.
మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని అరెస్టు చేయగా.. ''ఇలా జైలు.. అలా బెయిలు.'' అన్నట్టుగా బెయిల్ పై విడుదలయ్యారు.
రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై నగరమంతా కోపోద్రిక్తమైంది. ముఖ్యంగా పాతబస్తీలో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి పూట పాతబస్తీలో ప్రజలు ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పాతబస్తీ లో పరిస్థితులు టెన్షన్ టెన్షన్గానే ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు రాజాసింగ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కామన్ మ్యాన్ కామెంట్!
తనను బీజేపీ వదులుకోదంటూ.. రాజాసింగ్ చేసిన కామెంట్ల పై ... సాధారణ వ్యక్తులు సైతం ఆసక్తిగా స్పందిస్తున్నారు. ''ఎలా వదులుకుంటుంది రాజా! నీలాంటి వారి వల్లే కదా.. పార్టీ మనుగడ ఆధారపడి ఉంది. ఢిల్లీలో నూపుర్ శర్మ.. హైదరాబాద్‌లో నువ్వు.. భలే ఉన్నారు లే!'' అని కామెంట్లు చేస్తున్నారు. బీజేపీకి మీలాంటి వారే కదా..బ్యాక్ బోన్స్ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వివాదాలతో పబ్బం గడుపుకునే పార్టీలకు.. మీరు లేకపోతే.. పొద్దు పోతుందా? అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.