Begin typing your search above and press return to search.

రాజాసింగ్ వ్యాఖ్య‌లు.. పాకిస్థాన్ రియాక్ష‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   24 Aug 2022 2:55 PM GMT
రాజాసింగ్ వ్యాఖ్య‌లు.. పాకిస్థాన్ రియాక్ష‌న్ ఇదే!
X
బీజేపీ నేత‌లు వ‌రుస పెట్టి చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు దేశ ప‌రువును స‌రిహ‌ద్దుల్లో న‌డిరోడ్డుపై నిల‌బె డుతున్నాయి. కేవ‌లం మూడు మాసాల్లో బీజేపీ నేత‌లు మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌లు.. అంత‌ర్జాతీ య‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీశాయి. ముఖ్యంగా మ‌న పొరుగు దేశం.. పైగా శ‌తృ దేశం .. ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా ఖండించింది. ప్ర‌ధానంగా రాజాసింగ్ వ్యాఖ్య‌ల‌పై పాకిస్థాన్ మండిప‌డింది.

ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా బీజేపీ నేతలు చేస్తున్న వరుస కామెంట్లను అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. "మహ్మద్ ప్రవక్తపై మూడు నెలల వ్యవధిలో బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ పౌరులతో పాటు, ప్రపంచంలోని కోట్లాది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి" అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

బెయిల్‌పైనా సందేహాలు!

రాజాసింగ్ పై బీజేపీ తీసుకున్న క్రమశిక్షణా చర్యలపైనా పాక్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఏదో మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని విమర్శించింది. బీజేపీ తీసుకున్న చర్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎదుర్కొన్న బాధను తగ్గించలేవని చెప్పుకొచ్చింది. రాజాసింగ్ను అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే బెయిల్పై విడుదల చేయడాన్ని ఖండించింది. దీనిపై తక్షణమే, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మహ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాజాసింగ్ను బీజేపీ నుంచి పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ రాజ్యాంగానికి, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ఈ చర్యలు తీసుకుంది. మూడు నెలల క్రితం బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ ఇలాంటి వివాదంలోనే చిక్కుకోగా.. అప్పుడు సైతం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.

నుపుర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇస్లామిక్ దేశాలు నుపుర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడు రాజాసింగ్ వంతు వ‌చ్చింది. మ‌రి దీనిని బ‌ట్టి.. భార‌త్ అవ‌లంబిస్తున్న ప్ర‌త్యేక విదేశాంగ విధానానికి ఇది తూట్లు పొడ‌వ‌డం కాదా? అని పాక్ ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.