Begin typing your search above and press return to search.
యాక్షన్ కు రియాక్షన్ అంటూ వాట్సాప్ వీడియో రిలీజ్ చేసిన రాజాసింగ్
By: Tupaki Desk | 23 Aug 2022 5:31 AM GMTయాక్షన్ రియాక్షన్ ఉంటుంది. నేను మొదటే చెప్పా. చేతులు జోడించి అడిగా.. మా శ్రీరామచంద్రుడ్ని.. సీతమ్మ తల్లిని కించపరిచిన వ్యక్తి షో తెలంగాణలో ఏర్పాటు చేయొద్దని కోరా. కానీ.. వినకుండా ఫాల్తూ కేటీఆర్ ప్రొటెక్షన్ ఇచ్చి మరీ షో నిర్వహించారు. ప్రధానమంత్రి భద్రతకు కూడా అంతలా సెక్యురిటీ ఇవ్వరు. కానీ.. మునావర్ షో కు ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.
సోమవారం రాత్రి మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన యూట్యూబ్ వీడియో విడుదల చేశారని.. దీనిపై మజ్లిస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. పాతబస్తీలోని పలు పోలీస్ స్టేషన్ లో తనపై ఫిర్యాదులు చేశారని.. ఒక స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 137 సెకన్ల వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోను వాట్సాప్ గ్రూపులకు సర్క్యులేట్ చేశారు. ఇందులో రాజకీయ అంశాల్ని ప్రస్తావించిన రాజాసింగ్.. తాను చేసిన కామెడీ షో గురించి చెప్పారే కానీ అందులో తానేం మాట్లాడిన విషయాల్ని మాత్రం ప్రస్తావించలేదు. "ఇవాళ పాతబస్తీలో దాదాపు అన్నిపోలీస్ స్టేషన్ ల్లో నాకు వ్యతిరేకంగా కంప్లైంట్లు ఇస్తున్నారు.
ఎందుకు ఇలా జరిగింది? మా రాముడు రాముడు కాదా? మా సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి కాదా? వారిపైన వల్గర్ లాంగ్వేజ్ లో కామెడీ చేసిన అతని షో ను నిర్వహించొద్దని దండం పెట్టి మరీ రిక్వెస్టు చేశారు. డీజీపీ.. సీపీ.. ఫాల్తూ కేటీఆర్ ను కూడా కోరా. ఆపినారా? మా రాముడ్ని తిట్టిన వ్యక్తికి భారీగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి షో చేయించారని తెలంగాణలోని వారంతా అడుగుతున్నారు" అని వ్యాఖ్యానించారు.
రాముడికి ఫాలో చేసే వారికి తెలంగాణలో విలువ లేదు.. రాముడ్ని తిట్టే వారికి విలువ ఉందన్న సందేశాన్ని ఇస్తున్నారా మీరు? అని ప్రశ్నించారు. తాను చేసిన కామెడీ వీడియోలో ఎక్కడా పేరును ప్రస్తావించలేదని.. తాను చేసిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే..
దాన్ని డిలీట్ చేశారన్నారు. ఆ వీడియోపార్ట్ 2 కూడా ఉందన్నారు. తన మీద కేసులు పెట్టినా.. అరెస్టు చేసినా వెనుకాడనని.. ఎందుకంటే ధర్మం మొదటిదని.. తర్వాతే రాజకీయమని వ్యాఖ్యానించారు. మొత్తంగా రాజాసింగ్ వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు మరో ఇష్యూగా మారిందన్న మాట వినిపిస్తోంది.