Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 Dec 2019 7:03 AM GMT
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X
తాజాగా మీడియా సాక్షి గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల మధ్య రాజకీయా విభేదాలు బట్ట బయలు అయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , రాజాసింగ్ ఇద్దరు కూడా తెలంగాణ బీజేపీ లో కీలకనేతలు అన్న విషయం అందరికి తెలిసిందే. కేసీఆర్ హావ పూర్తిగా వీచిన మొన్నటి ఎన్నికలలో కిషన్ రెడ్డి గెలవలేక పోయినా , రాజాసింగ్ మాత్రం గెలవగలిగారు. తెలంగాణ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. .ఆయన రూటే సెపరేటు... ఆయనకు నాయకులంటూ ఎవరు ఉండరు, ఆయనకు ఆయనే బాస్... అందుకే ఎక్కడ హిందూయిజానికి ఆపద వచ్చినా రాజాసింగ్ ముందుగా స్పందిస్తారు. పార్టీ తో సంబంధం లేకుండా అక్కడ ప్రత్యక్షమవుతారు. దీనితోనే ఇటీవలే రాజాసింగ్ బాగా ఫెమస్ అయ్యారు.

కానీ , అయన చూపించే దూకుడు వల్ల ఆయనకి ఎంత పేరు , పాపులారిటీ ని తీసుకువచ్చిందో ...అదే దూకుడు ఆయన కి శత్రువుగా మారింది. పార్టీలోని కొందరు అగ్ర నేతలు ..ఇప్పుడు రాజాసింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి , రాజాసింగ్‌కు మధ్య రాజకీయ వైరం ఉన్నట్టు రాజాసింగ్ మీడియాతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని , తన నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకు తెలియకుండానే పర్యటనలు కొనసాగిస్తున్నారని కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తనను ఒక ఎమ్మెల్యేగా గుర్తించడం లేదని అన్నారు. గతంలో కేంద్రమంత్రిగా ఉన్న దత్తాత్రేయ ప్రోటోకాల్ పాటించేవారని అన్నారు. అలాగే పార్టీలో తన ఎదుగుదలని కొందరు అడ్డుకుంటున్నారని , బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమికి సైతం పార్టీలోని నేతలే కారణం అని సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే అధ్యక్ష పదవికి పోటిపడుతున్న బండి సంజయ్‌తో పాటు, ఎమ్మెల్యే అర్వింద్, డీకే అరుణలు సైతం అధ్యక్ష పదవి చేపట్టేందుకు అర్హులేనని వ్యాఖ్యానించారు. అయితే అందరిలో అర్వింద్ కొంత ఆర్ధికంగా బలవంతుడిగా ఉంటాడని అన్నారు.గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు పెద్ద స్థాయి నాయకులు కంకణం కట్టుకున్నారని ..తీవ్ర ఆరోపణలు చేశాడు. అయినా పార్టీ కార్యకర్తలే వారి ప్రాణాలు ఫణంగా పెట్టి తనను గెలిపించారని రాజాసింగ్ అన్నారు. అలాగే నాకు ఎవరు మద్దతుగా నిలిచినా , నిలవకపోయిన కూడా పార్టీకి సేవ చేస్తూనే ఉంటా అని చెప్పారు.