Begin typing your search above and press return to search.

నగ్నంగా కనిపిస్తారు.. బ్లాక్ మెయిల్ చేస్తారు

By:  Tupaki Desk   |   29 Aug 2020 11:30 PM GMT
నగ్నంగా కనిపిస్తారు.. బ్లాక్ మెయిల్ చేస్తారు
X
గతంలో దోపిడీలు, దొంగతనాలకు పేరుగాంచిన రాజస్థాన్ భరత్ పూర్ గ్యాంగ్ లు ఇప్పుడు ‘సైబర్ క్రైమ్’లు చేయడానికి అలవాటుపడ్డాయి. వారి వలలో పడ్డ వారు పరువు పోగొట్టులేక.. వేరొకరికి చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. భారత్ పూర్ గ్యాంగ్ వల్ల నెలరోజుల్లోనే 50మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

మహిళా క్రిమినల్స్ అందమైన యువతుల ప్రొఫైల్ పిక్ తో సోషల్ మీడియాలో పెట్టుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. మగవారు స్పందించగానే.. వాట్సాప్ నెంబర్ తీసుకొని చాట్ చేస్తారు. శృంగార పదజాలంతో రెచ్చగొడుతారు. వీడియో కాల్స్ చేసి న్యూడ్ గా కనిపిస్తారు. మగవారిని లైంగికంగా రెచ్చగొట్టి మగవారిని నగ్నంగా వీడియో కాల్ లో కనిపించమంటూ రెచ్చగొడుతారు. దీంతో ఆ వీడియోను రికార్డ్ చేస్తారు.

తర్వాత రోజు ఆ నగ్న వీడియో పంపించి బెదిరిస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫేస్ బుక్, సోషల్ మీడియాలో పెడుతామని బెదిరిస్తారు. పరువు పోతుందని భయపడి చాలా మంది అడిగినంత డబ్బు ఇస్తారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

హైదరాబాద్ లో ఇటీవల ఓ వ్యాపారి రాజస్థాన్ మహిళ బుట్టలోపడ్డాడు. అతడు డబ్బు ఇవ్వకపోతే యూట్యూబ్ లో అతడి నగ్న వీడియోలు అప్ లోడ్ చేశారు. చనిపోదామని డిసైడ్ అయిన వ్యాపారి ఆగి ధైర్యం చేసి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియా నుంచి తొలగించుకున్నాడు. రాజస్థాన్ ముఠాపై కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా 50 కేసులు ఇటీవల ఇవే వచ్చాయట.. దీంతో ముక్కు మొహం తెలియని వారితో వీడియో చాట్ చేయవద్దని పోలీసులు హితవు పలుకుతున్నారు.