Begin typing your search above and press return to search.
గోల్డ్ స్మగ్లింగ్ చేయమన్న బీజేపీ ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 1 Jun 2018 6:52 AM GMTనోటి నుంచి వచ్చే మాట తిన్నగా ఉంటే తిప్పలే ఉండవు. అదేం సిత్రమో కానీ.. బీజేపీ నేతల నోటి నుంచి వచ్చే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొన్ని అయితే వివాదస్పదంగా మారుతున్నాయి. వివాదాలంటే మోజు పెరుగుతుందో ఏమో కానీ.. వారి నోటి నుంచి వచ్చే మాటలు బీజేపీ పరువును గంగలో కలిపేస్తున్నాయని చెప్పక తప్పదు. తాజాగా అలాంటి మాటనే చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు రాజస్థాన్ కు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు. ఇంతకీ ఆయన చెప్పిన మాట వింటే అవాక్కు అవ్వాల్సిందే.
డ్రగ్స్ అమ్మటం మానేయండి.. ఎంచక్కా బంగారం స్మగ్లింగ్ చేయండి.. కేసులు పడినా.. నాన్ బెయిలబుల్ కేసు అవుతుందంటూ ఇస్తున్న చిట్కాలు ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే అర్జున్ లాల్ గార్గ్ తాజాగా ఒక సమావేశాన్ని నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ అక్రమ రవాణా సమస్యలతో కూడుకున్నదని.. ఆ కేసుల్లో బుక్ అయి ఎంతోమంది జోధపూర్ జైల్లో మగ్గుతున్నారని.. అందుకే డ్రగ్స్ రవాణా జోలికి వెళ్లొద్దని కోరారు.
డ్రగ్స్ అమ్మకం జోలికి వెళ్లొద్దని.. అది చట్ట వ్యతిరేక పనిగా అభివర్ణించిన ఎమ్మెల్యే.. డ్రగ్స్ వ్యాపారం నుంచి బయటకు రావాలంటూ రాజస్థాన్‌లో ఈ తరహా వ్యాపారం చేసే దేవాసీ వర్గం వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా. . ఇక్కడే ఆయన వివాదంలోకి కూరుకుపోయే సలహాలు ఇవ్వటం షురూ చేశారు.
ఒకవేళ అక్రమ వ్యాపారం చేయాల్సి వస్తే బంగారం స్మగ్లింగ్ చేయాలే కానీ డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని కోరారు. రెండింటి ధర ఒకటేనని.. డ్రగ్స్ కంటే కూడా బంగారం స్మగ్లింగ్ బిజినెస్ సురక్షితమని పేర్కొన్నారు. అంతేనా.. తాను సమావేశమైన వారి చేత తాము డ్రగ్స్ అక్రమ రవాణా చేయమని.. బంగారం వ్యాపారమే చేస్తామంటూ ప్రమాణం చేయటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.