Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో కమలం కమిలిపోతోందా..?

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:46 AM GMT
రాజస్థాన్ లో కమలం కమిలిపోతోందా..?
X
పద్నాలుగు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాటి అధికారపక్షమైన యూపీఏ రాజస్థాన్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయింది. ఘోరమైన ఫలితాలతో కాంగ్రెస్ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.

లలిత్ మోడీ వ్యవహారం కావొచ్చు.. రాష్ట్రంలో వసుంధరాజె పరిపాలన తీరుపై ఉన్న అసంతృప్తి కారణం కావొచ్చు.. తాజాగా విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర రాజకీయ రంగు మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లో కోలుకోవటమే కాదు.. రానున్న రోజుల్లో బలపడే అవకాశం ఉందన్న సంకేతాల్ని ఇచ్చింది.

రాజస్థాన్ లోని మొత్తం 129 మున్సిపాల్టీలలో అధికార బీజేపీ 66 సొంతం చేసుకుంటే.. కాంగ్రెస్ 35 మున్సిపాల్టీలను కైవశం చేసుకుంది. ఇండిపెండెంట్లు 17 చోట్లు విజయం సాధిస్తే.. ఇతర పార్టీలు 11 మున్సిపాల్టీలను సొంతం చేసుకున్నాయి. ఇక.. వార్డుల వారీగా చూస్తే.. మొత్తం 3351 వార్డులకు.. బీజేపీ 1443 సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ 1164 వార్డుల్ని కైవశం చేసుకోవటం గమనార్హం.

వార్డుల్ని చేజిక్కించుకున్న తీరు చూస్తే.. రాజస్థాన్ లో అధికార బీజేపీ పట్టు సడులుతుందన్న అంశంతో పాటు.. విపక్ష కాంగ్రెస్ బలం పుంజుకుంటుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మున్సిపాల్టీల్లో బీజేపీ కాంగ్రెస్ ల మధ్య వ్యత్యాసం 31 ఉంటే (మొత్తం 129 మున్సిపాల్టీలకు).. వార్డుల్లో మాత్రం కేవలం 279 మాత్రమే (మొత్తం వార్డులు 3351) ఉండటం చూస్తే.. కాంగ్రెస్ ఎంతగా బలపడుతుందో ఇట్టే తెలుస్తుంది. ఒక విధంగా తాజా ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఒక హెచ్చరికగా చెప్పొచ్చు.