Begin typing your search above and press return to search.
వినూత్నంగా మహిళా సీఐ పెళ్లికార్డు!
By: Tupaki Desk | 10 April 2018 4:49 AM GMTనలుగురు నడిచే దారిలో నడవటం మామూలే. అందుకు భిన్నంగా వ్యవహరించేటోళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి తీరునే ప్రదర్శించారో మహిళా పోలీస్ ఇన్ స్పెక్టర్. తాజాగా ఆమె పెళ్లికార్డును తయారు చేయించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. వార్తాంశంగా మారింది. ఇంతకీ.. ఆ సీఐ ఎవరు? ఎక్కడివారు? తన పెళ్లి కార్డు విషయంలో ఆ సీఐ ఏం చేశారు? అన్నది చూస్తే..
రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన సీఐ మంజుల వివాహం ఈ నెల 19న జరగనుంది. ఈ సందర్భంగా ఆమె తన పెళ్లి కార్డును వినూత్నంగా అచ్చేయించారు. తన శుభలేఖలో ట్రాఫిక్ రూల్స్ ను ప్రింట్ చేయించారు. చాలామందికి ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన లేకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినట్లు ఆమె చెబుతున్నారు. అందుకే తన ఉద్యోగ బాధ్యతలతో పాటు.. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని ఆమె చేస్తుంటారు.
ఇందులో భాగంగా తాజాగా తన పెళ్లికార్డులోనూ ట్రాఫిక్ రూల్స్ ను ప్రత్యేకంగా ముద్రించారు. సీఐ మంజుల వ్యక్తిగత జీవితంలోనూ ప్రమాదాల కారణంగా ఆమె భారీగా నష్టపోయారు. ఒక ప్రమాదంలో ఆమె తండ్రి మరణించగా.. ఒక దుర్ఘటనలో ఆమె సోదరుడు కూడా మరణించారు. దీంతో.. తన తల్లి కోరిక మీద పోలీస్ అయిన మంజు.. ట్రాఫిక్ అవగాహన కోసం విపరీతంగా కృషి చేయటమే కాదు.. చివరకు తన పెళ్లిశుభలేఖలోనూ ప్రింట్ చేయించి తనకున్న కమిట్ మెంట్ ను చేతల్లోనూ చెప్పేశారు.