Begin typing your search above and press return to search.
నాలిక నాకించిన బాబాకు జైలు గతైందిగా
By: Tupaki Desk | 25 Sep 2017 5:29 AM GMTదేశంలో డేరా బాబా ఉదంతాలు ఒక్క గుర్మీత్ సింగ్‌తోనే ఆగిపోలేదు. ఇలాంటి వాళ్లు ఎందరో ఉన్నారని తాజాగా వెలుగు చూసిన సంఘటన స్పష్టం చేస్తోంది. తనను `సంతోష` పెడితే.. ఐఏఎస్ ను చేయగలనని, తనను `సుఖ` పెడిగే ఐపీఎస్ ను అవసరమైతే ఎమ్మెల్యేను సైతం చేసేస్తానని మోసాలకు దిగుతున్న మరో బాబా వెలుగులోకి వచ్చాడు. రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఈ బాబా ఉదంతం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. ఫలహారీ బాబాగా ప్రాచుర్యం పొందిన ఈయన వయసు 60కి పైగానే ఉంది. అయితేనేం.. ఎంతసేపూ.. 20 ఏళ్ల వయసు ముచ్చట్లలో మునిగి తేలుతూ ఉంటాడు ఈ బాబా! ఇక, బాబా స్టైల్ డిఫరెంట్ అంటున్నారు ఈయనతో బాధలు అనుభవించిన భక్తులు.
మరి ఆ విషయం ఏంటో చూద్దాం పదండి.. రాజస్థాన్ కు చెందిన ఫలహారీ బాబాకు పెద్ద పేరుంది. ఆధ్యాత్మిక సేవలో కొన్నేళ్లుగా ఆయన ``తనదైన`` సేవ అందిస్తున్నాడు. తన దగ్గరకు వచ్చే వారిని ``ఆచి తూచి`` భక్తులుగా ఎంచుకుంటాడు. వారిలో లేనిపోని ఆశలు రేకెత్తిస్తాడు. 'నేను నా నాలికపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాసుకుంటాను. దాన్ని నువ్వు నాకాలి. దీంతో నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలా మందికి ఇలానే జ్ఞానం ప్రసాందించాను' అని ఆకర్షిస్తాడు బాబు. ఆ.. దీనిలో ఏముందిలే అని ఆయన నాలికను నాకేందుకు రెడీ అయ్యాక తెలుస్తుంది బాబా గారి అసలు బాగోతం.
రాత్రి 7.30 ప్రాంతంలో బాబా తనను గదిలోకి పిలిపించుకుని తన శిష్యులందరినీ బయటకు పంపి తలుపులు మూసేశాడని, ఆ తర్వాత మంచం మీద కూర్చుని తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ బాధితురాలు లబోదిబో మంది. గట్టిగా పట్టుకోవడంతో తాను అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చిందని, ఇదంతా భగవంతుడి ఆదేశాల ప్రకారమే చేస్తున్నానంటూ బలవంతం చేశాడని పేర్కొంది. తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో ఎవరో తలుపు తట్టారని, దాంతో హడావిడిగా బట్టలు వేసుకున్న బాబా ఎవరికైనా ఈ విషయం చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదరించాడని బాధితురాలు పేర్కొంది. కాగా, బాధితురాలు కొద్ది వారాల పాటు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోయిందట. ఎట్టకేలకు తెగించి తల్లిదండ్రుల వద్దే తన గోడు వెళ్లబోసుకోవడంతో వారు పోలీస్ కంప్లయిట్ ఇచ్చారు. దీంతో పోలీసులు బాబాను అరెస్టు చేసి, 15 రోజులు జైలుకు పంపారు. మొత్తానికి డేరా బాబా ఉదంతాన్ని కళ్లకు కట్టిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.