Begin typing your search above and press return to search.
అప్పుడు కండోమ్ ప్రకటనలు ఎందుకు వద్దు?
By: Tupaki Desk | 20 Dec 2017 10:30 PM GMTకండోమ్ ల ప్రకటనలపై కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. టీవీల్లో కండోమ్ ప్రకటనలను రాత్రి 10 తర్వాతే ప్రసారం చేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ డిసెంబర్11న అన్ని టీవీ చానళ్లకు సూచించింది. ఈ ఆదేశాలపై న్యాయస్థానం కొత్త సందేహం వ్యక్తం చేసింది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 10 గంటల మధ్య టీవీల్లో కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించడానికి కారణాలేంటని రాజస్థాన్ హైకోర్టు ప్రశ్నించింది. ఈమేరకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈనెల మొదటివారంలో...కండోమ్ పై టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షించి విషయాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ) దృష్టికి తెచ్చింది. సన్నీలియోన్ కండోమ్ వాణిజ్య ప్రకటన గురించి ఇందులో ప్రధానంగా నొక్కిచెప్పింది. దీంతో కండోమ్ యాడ్స్ ను కేవలం రాత్రి సమయంలోనే అనుమతించాలని (ఏఎస్ సీఐ) సూచించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎస్‌సీఐ తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే కండోమ్ యాడ్స్ ను టీవీల్లో ప్రసారం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ యాడ్స్ ను కేవలం పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఏఎస్ సీఐకి సూచించింది. కండోమ్ ప్రకటనలు రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్ సీఐ పేర్కొంది. వాణిజ్య ప్రకటనల్లో ముఖ్యంగా మహిళల చిత్రణలో అసభ్యత - అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది.
అయితే ఈ ఆదేశాలపై ఓ స్వచ్ఛంద సంస్థ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓవైపు కుటుంబ నియంత్రణపై ప్రచారం చేస్తూనే, మరోవైపు కండోమ్ ప్రకటనలపై పరిమితులు విధించడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ - జస్టిస్ డీసీ సోమానితో కూడిన ధర్మాసనం కేంద్రం నిర్ణయం వెనుక సహేతుకమైన కారణమేంటని ప్రశ్నించింది. ఉదయం ఆరు గంటలనుంచి రాత్రి 10 గంటల మధ్య టీవీల్లో కండోమ్ ప్రకటనల ప్రసారంపై నిషేధం విధించడానికి కారణాలేంటని ప్రశ్నిస్తూ...ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఇదిలాఉండగా... ఈ ఏడాది ఆగస్టులో అసెంబ్లీలో ఏకంగా సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్ గురించి గోవా అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సన్నీలియోన్ యాడ్ పై సభలో దుమారం రేగింది. సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్స్ ను గోవా రాష్ట్ర బస్సుల్లో రాకుండా ఆపాలని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆండ్రీ ఫ్రాన్సిస్ సిల్వీరా డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ప్రచారాలు మనకు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని లేవనెత్తే ముందు అసెంబ్లీలో కండోమ్ అన్న పదం ఉపయోగించవచ్చా అని ఆయన స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను అడిగారు. ఇలాంటి యాడ్స్ గోవా ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ బస్సులను మన విద్యార్థులు, ప్రజలు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు అని సిల్వీరా అన్నారు. సదరు కండోమ్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం కదంబ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో ఈ యాడ్స్ ను ప్రదర్శించారు.