Begin typing your search above and press return to search.
మంత్రి ఇంటికెళ్లి చెంప చెళ్లుమనిపించిన మరో మంత్రి
By: Tupaki Desk | 30 Jun 2018 9:56 AM GMTరాజస్థాన్ లో ఇద్దరి మంత్రుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ మంత్రి ఇంటికి వెళ్లి మరీ మరో మంత్రి ఆయనపై చేయి చేసుకోవడం.. చెంప పగులకొట్టడం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారింది..
రాజస్థాన్ రాష్ట్రం శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగడం లేదనే ఆరోపణలు రావడంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్షీధర్ బజియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు తోటి కేబినెట్ మంత్రి - విద్యాశాఖ చూస్తున్న వసుదేవ్ దేవ్నానీ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మంత్రుల మధ్య బదిలీల వ్యవహారంలో మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి బజియా.. దేవ్నానీపై చేయిచేసుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జి అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిచి క్లాస్ పీకాడు.
కానీ బయటకు వచ్చాక మాత్రం మంత్రి బజియా ఈ వార్తలను ఖండించాడు. కావాలనే తనపై వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశం కావడంతో రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.