Begin typing your search above and press return to search.
జేఎన్ యూలో కండోమ్ ల లెక్క తెలుసా?
By: Tupaki Desk | 23 Feb 2016 9:01 AM GMTరైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని రాజస్థాన్ కు చెందని బీజేపీ ఎంఎల్ ఏ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా వారం కాకముందే మరో రాజస్థాన్ బీజేపీ ఎంఎల్ ఏ జ్ఞాన్ దేవ్ అహూజా మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జేఎన్ యూ ఆవరణలో రోజుకు 3,000 వాడిన కండోమ్ లు, వేలకొద్ది మద్యం సీసాలు కనిపిస్తాయని, జేఎన్ యూ విద్యార్ధులు మాదకద్రవ్యాలకు బానిసలని, వీళ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. వీళ్లను సపోర్టు చేసిన రాహుల్ గాంధీ జాతి వ్యతిరేకి అని, రాహుల్ ను కాల్చిపారేయాలని అన్నాడు.
అయితే... బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విద్యార్థులు - విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ అంతే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆహూజా కండోమ్ లు లెక్కబెట్టుకుంటున్నారని.... వాటిని ఏరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వాడేసిన కండోమ్ లు ఏరుకుని జీవనం సాగిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. తెల్లవారితే స్త్రీలను గౌరవించాలని నీతి బోధలు చేసే బీజేపీ వాళ్లకు యూనివర్శిటీ అమ్మాయిలు వ్యభిచారుల్లాగా కనిపిస్తున్నారా? అని నిలదీస్తున్నారు. దేశాన్ని - సైన్యాన్ని - జాతీయ జెండాలను గౌరవించడం మంచిదే.... అయితే... అంతకంటే ముందే జన్మనిచ్చిన స్త్రీ జాతిని గౌరవించడం నేర్చుకోండి అంటూ బీజేపీ నేతలకు విద్యార్థి సంఘాలు చురకలు వేశాయి.