Begin typing your search above and press return to search.
అలా చేసిన ఐదో రాష్ట్రంగా మధ్యప్రదేశ్!
By: Tupaki Desk | 5 Feb 2020 1:53 PM GMTఎన్నార్సీ - ఎన్ పీఆర్ - సీఏఏలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు - ఆందోళనలు జరగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అక్రమ చొరబాటుదారుల ఏరివేతకే సీఏఏ అమలు చేస్తున్నామని, సీఏఏ వల్ల భారతీయ ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని కేంద్రం చెబుతోంది. అయితే, కేవలం మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీఏఏని వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఎన్నార్సీ - సీఏఏ - ఎన్ పీఆర్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ - పంజాబ్ - పశ్చిమ బెంగాల్ - రాజస్థాన్ అసెంబ్లీలు తీర్మానించాయి. తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన మధ్యప్రదేశ్ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది.
సీఏఏకు వ్యతిరేకంగా కేరళ సీఎం పినరాయి విజయన్ తొలిసారిగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాదు, సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయన్ స్ఫూర్తితో పంజాబ్ - పశ్చిమ బెంగాల్ - రాజస్థాన్ ప్రభుత‌్వాలు సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. తాజాగా ఈ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ వచ్చి చేరింది. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన ఐదవ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. మిగతా రాష్ట్రాలకంటే ఓ అడుగు ముందుకు వేసిన మధ్యప్రదేశ్ జాతీయ పౌర జాబితా (ఎన్ పీఆర్)ను కూడా పునఃసమీక్షించాలని కేబినెట్ తీర్మానించింది. ఓ వైపు కేంద్రం సీఏఏ - ఎన్నార్సీలను అమలు చేసి తీరతామని చెబుతోంది. మరోవైపు, సీఏఏను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందు ముందు ఏఏ రాష్ట్రాలు ఈ జాబితాలో చేరతాయో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.