Begin typing your search above and press return to search.
‘ఖాకీ’ సినిమా రిపీట్.. తెలంగాణ పోలీసులపై దాడి
By: Tupaki Desk | 3 Jun 2019 10:13 AM GMTతమిళ హీరో కార్తి నటించిన ‘ఖాకీ’ సినిమా చూశారా.? అందులో తమిళనాట దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసిన రాజస్థాన్ దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన కార్తి సహా పోలీసులను గ్రామస్థులంతా రౌండప్ చేసి చావబాదుతారు. అచ్చం అలాంటి సీనే తెలంగాణ పోలీసులకు ఎదురైంది. రాజస్థాన్ గ్రామస్థుల చేతుల్లో తెలంగాణ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక పోలీసు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
వరంగల్ లోని సుబేదారి ప్రాంతంలో కొద్దిరోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. రాజస్తాన్ నుంచి వచ్చిన ముఠానే ఈ దొంగతనాలు చేస్తుందని ఆధారాలు సంపాదించిన వరంగల్ పోలీసులు అనుమానితుల కాల్ డేటా ఆధారంగా రాజస్తాన్ వాసులని తేలింది. భిల్వారా జిల్లా పూలియా కలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలోలా గ్రామానికి చెందిన నౌరత బగారియా అనే వ్యక్తి సూత్రధారి అని నిర్ధారణకు వచ్చారు వరంగల్ పోలీసులు. దీంతో వారిని పట్టుకోవడానికి వరంగల్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఎస్సై డేవిడ్ రాజ్, ఎస్ఐ శివశంకర్, కానిస్టేబుళ్లు మొత్తం ఐదుగురు రాజస్థాన్ వెల్లారు. అక్కడ ఓ తవేరా కారును అద్దెకు తీసుకొని పూలియా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి రాజస్తాన్ కానిస్టేబుల్ ను వెంట బెట్టుకొని నిందితుడు ఉన్న పాలోలా గ్రామానికి వెల్లారు. సురేష్ బగారియా గురించి ఆరాతీశారు. కానీ అప్పటికే సురేష్ బగారియా పారిపోయాడని తెలిసింది. దీంతో ఆయన సమీప బంధువు, మరో నిందితుడు రామ్ కరణ్ బగారియాను అదుపులోకి తీసుకున్నారు. తమ తవేరా వాహనంలో కూర్చుండబెట్టి తీసుకెళుతుండగా.. గ్రామస్థులంతా అడ్డుపడి తమ కులానికి చెందిన వ్యక్తిని తీసుకెళ్తారా అని గొడవకు దిగారు. పిల్లలను ఎత్తుకు పోయే దొంగలంటూ తెలంగాణ పోలీసులను చావబాదారు. తెలంగాణ పోలీసులు సివిల్ డ్రెస్ లో ఉండడంతో వారిని గుర్తించలేదు.
ఈ దాడిలో తెలంగాణ ఎస్సై శివశంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇక సమాచారం అందుకున్న రాజస్తాన్ పోలీసులు వచ్చి కొడుతున్న గ్రామస్థుల నుంచి తెలంగాణ పోలీసులను రక్షించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులపై దాడి చేసిన 25మంది గ్రామీణులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇక తెలంగాణలో దొంగతనాలను చేసిన సురేష్, రామ్ కరణ్ బగారియాలను అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఖాకీ సినిమా సీన్ మరోసారి అదే రాజస్థాన్ రాష్ట్రంలో రిపీట్ కావడం గమనార్హం.