Begin typing your search above and press return to search.
రాజస్థాన్ ప్లేయర్లకు తప్పిన భారీ ప్రమాదం.. విమానంలో పొగలు
By: Tupaki Desk | 23 May 2022 11:30 AM GMTఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జోరు మీద ఉంది. ఆ జట్టు ఈసారి వరుస విజయాలతో ఏకంగా టాప్ 2 స్థానంలోకి వెళ్లింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇతర జట్లతో సంబంధం లేకుండా మెరుగైన రన్ రేట్ తో ఈ ఘనత సాధించింది.
ప్రస్తుతం ఐపీఎల్ లో టాప్ 1లో గుజరాత్ ఉండగా.. రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఈ క్రమంలోనూ ఈ రెండు జట్లు క్వాలిఫైయర్ 1లో తలపడబోతున్నాయి. మే 24న కోల్ కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో రాజస్థాన్ రాయల్స్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. దీంతో క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ముంబై నుంచి కోల్ కతాకు రాజస్థాన్ టీం శనివారం విమానంలో బయలుదేరింది.
అయితే రాజస్థాన్ రాయల్స్ విమాన ప్రయాణంలో భయానక వింత అనుభవం ఎదురైంది. కోల్ కతాలో వాతావరణ పరిస్థితుల వల్ల విమానంలో దట్టమైన పొగమంచు చేరింది. దీంతో రాజస్థాన్ టీంలో ఓ ప్లేయర్ పైలెట్ విమానం దించు దించు అంటూ కేకలు వేశాడు. ఇక టీంలోని మరో ప్లేయర్ ల్యాండ్ చేస్తున్నాం కాసేపు ఓపిక పట్టు అంటూ సరదాగా అన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తో సహా ఇతర సభ్యులు ఇలా సరదాగా ప్రవర్తించినట్టు కనిపించింది. చివరకు విమానం కోల్ కతాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. రాజస్థాన్ ఆటగాళ్లు అందరూ బైబ్ చెబుతూ విమానం నుంచి దిగారు.
విమానం వర్షం పడుతున్న వేళ మేఘాల్లోంచి దూసుకుపోవడంతో కాసేపు పొగమంచు వల్ల ఫ్లైట్ లో దట్టమైన పొగమంచు చేరింది. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు కాసేపు భయాందోళనకు గురయ్యారు. చివరకు అంతా సర్దుకోవడంతో ఆటగాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇక మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తో పోటీపడబోతున్నాయి. మొదటి ఎలిమినేటర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. రెండో క్వాలిఫైయర్ లో గెలిచిన జట్టుతో మొదటి క్వాలిఫైయర్ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతుంది.
మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్నాయి. ఈ రెండు మ్యాచ్ లు ముగిసిన తర్వాత రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ కు వెళతాయి.