Begin typing your search above and press return to search.
బాబు రక్తం మరిగిపోయేలా చేసిన ప్రశ్న అది
By: Tupaki Desk | 11 Jan 2017 6:49 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు తనను తాను తమాయించుకోకపోవడం వల్ల జాతీయ మీడియా సాక్షిగా క్షమాపణలు తెలిపారు. అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బాబు ఇటీవల పాటిస్తున్న విధానాల వల్లే. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రఖ్యాత మేగజైన్ - టీవీ ఛానల్ అయిన ఇండియా టుడే ఆధ్వర్యంలో చెన్నైలో సౌత్ ఇండియా కాన్ క్లేవ్ జరుగుతోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు - వివిధ పార్టీలకు చెందిన నేతలు - విధానకర్తలు - విశ్లేషకులతో చర్చలు నిర్వహిస్తుంటారు. ఇలా నిర్వహించిన చర్చాగోష్టిలో నోరు జారిన బాబు అనంతరం క్షమాపణ చెప్పారు.
ఇండియాటుడే కాన్ క్లేవ్ లో భాగంగా మంగళవారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు - ఏపీ సీఎం చంద్రబాబు - కేరళ సీఎం పినరాయ్ విజయన్ - డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ల మధ్య చర్చాగోష్టి జరిగింది. దీనికి ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఆయన సూటిగా ప్రశ్నించారు. క్లీన్ ఇండియా - అమరావతి ఒక ఆదర్శ రాజధాని అని మీరు చెప్తుంటే...అదే సమయంలో ఏపీలో మీపై చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు.అంటే మీరు బ్రేక్ పార్టీస్-మేక్ పార్టీ విధానంతో అవినీతి పునాదులపై రాష్ట్రాన్ని నిర్మించాలనుకుంటున్నారా?’ అని చంద్రబాబును రాజ్ దీప్ సూటిగా ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బాబు సంయమనం కోల్పోయి పరుష వ్యాఖ్యలు చేయడమే కాకుండా...ఒకానొక సందర్భంలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘హూ ఈజ్ దట్ ఫెలో..?’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం పొరపాటు దొర్లిందని గమనిస్తూ...తమాయించుకొని చంద్రబాబు క్షమాపణ చెప్పారు. తమ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అగత్యం ఏమిటని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు.
ఇదిలాఉండగా... రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వదులుకున్నట్లు బాబు ఈ వేదికగా మరోమారు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలతో సంతృప్తిగా ఉన్నానని, జాతీయస్థాయికి వెళ్లబోనని చంద్రబాబు తెలిపారు. గతంలో తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా నిరాకరించానని, ఏపీని అభివృద్ధి చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యవమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/