Begin typing your search above and press return to search.
రాజీవ్ సుద్దపూస కాదు.. ముదురుకేసే!
By: Tupaki Desk | 24 Jun 2017 4:44 AM GMTబ్యూటీషియన్ శిరీష సూసైడ్ కు సంబంధించి రోజుకో సంచలనం బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరేజ్ ఫోటో స్టూడియో యజమాని రాజీవ్ గురించి ఇప్పటి వరకూ కాస్తంత పాజిటివ్ గా మాట్లాడిన పోలీసు వర్గాలు.. తొలిసారి షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది.
అమాయకుడిగా.. ఎలాంటి క్రిమినల్ రికార్డు లేని రాజీవ్ అంటూ పోలీసుల మెప్పు పొందిన అతగాడి అసలు రూపం గురించి తెలిసి అవాక్కు అయినట్లుగా తెలుస్తోంది. రాజీవ్ గురించి తాము మొదట్లో అనుకున్నట్లుగా అతడేమీ అమాయకుడేమీ కాదని.. పెద్ద ముదురుకేసన్న విషయాన్ని చెబుతున్నారు. బ్యూటీషియన్ శిరీషకు ముందు అతగాడికి నలుగురు మహిళలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. చివరకు నెల క్రితం కూడా ఒక కొత్త మహిళతో పరిచయం పెంచుకున్నట్లుగా తెలుసుకున్నారు.
శిరీష కంటే ముందుగా ప్రేమాయణం సాగించిన యువతుల్ని ఒక్కొక్కరుగా దూరం పెడుతూ వచ్చాడు. వారి అశ్లీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని చెబుతూ.. వారిని బెదిరిస్తూ తప్పించుకు తిరిగేవాడన్న విషయాన్ని గుర్తించారు. ఇలా.. ఇద్దరు మహిళల్ని మోసం చేసిన రాజీవ్ తర్వాత శిరీషను ప్రేమలో దించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచి వినిపిస్తున్న తేజస్విని గురించి కూడా కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
రాజీవ్‌ను ప్రేమించిన ఆమె.. శిరీష ఉదంతం తెలిశాక పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని బెదిరించటమే కాదు.. రాజీవ్ ఏ మాత్రం ఊహించని రీతిలో విజయవాడలో ఉంటున్న అతడి తల్లిదండ్రులతో మాట్లాడినట్లుగా విచారణలో బయటకు వచ్చింది. దీంతో.. ఆమెను దూరం పెట్టాలని రాజీవ్ పథక రచన చేసినట్లుగా తెలుస్తోంది.
మొదట తేజస్విని దూరం చేసి.. తర్వాత శిరీషను వదిలించుకోవాలని భావించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతులు తనకు సన్నిహితంగా ఉన్నప్పుడు వారికి తెలీకుండా వీడియోలు.. ఫోటోలు తీసినట్లుగా తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు షాక్ తింటున్నారు. ఆరేజ్ స్టూడియోలో అతగాడు సాగించిన రాసలీలలకు సంబంధించి హార్డడిస్క్‌లను పోలీసులు గుర్తించారు. రాజీవ్ గురించి బయటకు వచ్చిన కొత్త విషయాలు ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం. తొందరపడి ఈ కేసు గురించి ఒక కంక్లూజన్‌కు రావటం తప్పు అవుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/