Begin typing your search above and press return to search.

భారతీయులు ఊరట ఇచ్చే మాట చెప్పిన ప్రముఖుడు

By:  Tupaki Desk   |   21 Nov 2022 10:32 AM GMT
భారతీయులు ఊరట ఇచ్చే మాట చెప్పిన ప్రముఖుడు
X
గడిచిన కొన్ని నెలలుగా మాంద్యం మాట వణికిస్తోంది. ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుందన్న మాటలతో పాటు.. బడా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున ఇంటికి పంపిస్తున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. అదే సమయంలో అమెరికాలో మొదలైన మాంద్యం త్వరలోనే భారత్ ను హిట్ చేస్తోందని.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. మాంద్యం ఎలాంటి పరిస్థితులకు తీసుకొస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

అయితే.. అందరూ అంచనాలు వేస్తున్నట్లుగా మాంద్యం ఇబ్బందులు భారత్ కు ఉండవన్న మాటను నీతి ఆయోగ్ మాజీ వైఎస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ నోటి నుంచి రావటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్ మీద పడినా.. దేశీయంగా మాంద్యం తలెత్తదని ఆయన స్పష్టం చేస్తున్నారు. కీలకమైన నీతి ఆయోగ్ కు పని చేసిన ముఖ్యుడి నోటి నుంచి వచ్చిన ఈ భరోసా మాటలు కాస్తంత ఉపశమనంగా మారాయని చెప్పాలి.

అంతేకాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్రద్ధి రేటు 6-7 శాతం ఉంటుందని అంచనా కట్టారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరల మీదనే ఆధారపడి ఉంటుందని.. ఉక్రెయిన్ రష్యాల మధ్య ఉద్రికత్తల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని..దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి వస్తుందని ఆయన చెబుతున్నారు. మాంద్యం పరిస్థితులు అమెరికాతో పాటు.. యూరప్.. జపాన్.. చైనాతో సహా పలు దేశాల్లో ఏకకాలంగా ఉందని ఆయన చెప్పారు.

దేశీయంగా ఉన్న సానుకూల అంశాలతో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని పేర్కొన్నారు. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు.. సర్వీసుల ఎగుమతులను పెంచుకోవటానికి తగిన విధానాలపై మరింత ఫోకస్ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దేశం మొత్తానికి ఒకేలాంటి ఎగుమతుల విధానం అవసరమన్నారు. మొత్తంగా మాంద్యం ముప్పు మనకు పెద్దగా ఉండేది లేదన్న నిపుణుల మాట కాస్తంత ఉపశమనాన్ని కలిగిస్తుందని మాత్రం చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.