Begin typing your search above and press return to search.
అరెస్టులకు, కేసులకు ఈటల రాజేందర్ భయపడడు !
By: Tupaki Desk | 3 May 2021 6:41 AM GMTతెలంగాణ నేత , మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తాజాగా మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన భూములు కాజేశారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కూడా కొనసాగుతుంది. దీనిపై ఈ రోజు ఈటల మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను అరెస్టులకు, కేసులకు భయపడే వ్యక్తిని కాదని, తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారని ,ఎంత పెద్ద కేసులయినా పెట్టుకోండని, తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాన్నారు. సీఎంగారితో 19ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నానని, పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ మచ్చ తెచ్చే పనిచేయలేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రలోభాలు పెట్టినా లొంగలేదన్నారు. అందరికంటే ముందే నాకు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కానీ, పార్టీ కానీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఈటల తెలిపారు.
భూములను కాజేశానంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపిన కలెక్టర్ నివేదిక తమకు అందలేదని , తమ వివరణ కూడా అధికారులు అడగలేదని అన్నారు. వ్యక్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతమని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి తాను ఐదు పైసల సాయం కూడా తీసుకోలేదని, అలాగే ఐదు కుంటల భూమిని కూడా పొందలేదని చెప్పారు. అసైన్డ్ భూముల్లో పలు కంపెనీలు రోడ్లే వేయలేదా, అని ప్రశ్నించారు. తాను 66 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరిపించాలని చెప్పారు. అంతేగానీ, ప్రభుత్వం ఏది చెబితే అది చేసే అధికారులతో విచారణ జరిపించకూడదని డిమాండ్ చేశారు. నా ఫౌల్ట్రీ ఫామ్స్ ఉన్న ఏరియాల్లో తనిఖీల వల్ల కేసీఆర్ గారి గౌరవం పెరగదన్నారు. మీతో అడుగులు వేశాక మీతోనే ఉన్నాం , వ్యాపారాలు చేసుకునే అవకాశం కూడా లేదన్నారు.
అసైన్డ్ భూములు కొలుస్తామని కనీసం మాకు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. మీరు అపారమైన అనుభవం ఉన్నవాళ్లు, ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని అడిగారు. అసైన్డ్ భూములు కొనుక్కున్నా, షెడ్లు వేసుకున్నా చర్యలకు అర్హుడనని చెప్పారు. 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి సర్వే చేస్తారని తెలిపారు. మీ కేసులకు భయపడేటంత చిన్నవాడు కాదు ఈటల అని అన్నారు. అలాగే అసలు జమున హ్యాచరీస్ చైర్మన్ నేను కాదన్నారు. నివేదికలో నా పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. నాకు నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుపై కోర్టుకు వెళ్తానని ఈటల స్పష్టం చేశారు. కోర్టు దోషిగా తేల్చితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. మీ ఫార్మ్ హౌజ్ కోసం రోడ్డు వేయలేదా , మీకు ఎదురు చెప్పేవాళ్లు ఎవరూ లేరు, మీ అధికారులకు వావి వరుసలు లేవన్నారు. చట్టాన్ని గౌరవించాలి కానీ, అతిక్రమించకూడదన్నారు. 66 ఎకరాలు ఆక్రమించినట్టు ఎలా నివేదిక ఇస్తారని ప్రశ్నించారు. మీ ఏసీబీ, విజలెన్స్, కలెక్టర్, మీరు కోరుకున్నట్టే నివేదిక ఇస్తారని ఈటల విమర్శించారు. నా ఇంటి చుట్టూ పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తాను పదవుల కోసం పాకులాడబోనని ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ అడగవచ్చని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.