Begin typing your search above and press return to search.
సైకిల్ పార్టీ నాయకుడి నాలుక కోస్తే 50 లక్షలు!
By: Tupaki Desk | 1 July 2017 8:37 AM GMTతరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమాజ్ వాదీ పార్టీ నేత ఆజమ్ ఖాన్ మరోమారు తన నోటీ దురుసును ప్రదర్శించారు. సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని ఇటీవల ఆజమ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అత్యాచారానికి పాల్పడే సైనికుల మర్మాంగాలను సాయుధ మహిళలు కోసేశారని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ఆరోపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా రాజకీయ పార్టీలు ఆజమ్ ఖాన్ వ్యాఖ్యల పట్ల సీరియస్ అయ్యాయి. ఈ క్రమంలో భారతీయ ఆర్మీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజమ్ ఖాన్‌పై రెండు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. హజ్రత్ గంజ్, రాంపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ ఫిర్యాదులను నమోదు చేశారు. వీటిని స్వీకరించిన పోలీసులు భారత సైన్యాన్ని అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు దేశద్రోహం కేసు నమోదు చేశారు.
భజరంగ్ దళ్ - విశ్వహిందూపరిషత్ లకు చెందిన అనిల్ పాండే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆజంఖాన్ పై ఐపీసీ సెక్షన్లు 124 ఎ - 131 - 505 సెక్షన్ల కింద బిజ్నూర్‌లోని చాంద్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భద్రతాదళాలు తమ పరిధిని మించి అతిగా ప్రవర్తిస్తున్నందున కొన్ని ప్రాంతాల్లో మహిళలు అక్కడి సైనికుల జననాంగాలను కోసేస్తున్నారంటూ ఆజంఖాన్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనిపై విశ్వహిందూపరిషత్ - బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ ఆజంఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, ఆజంఖాన్ నాలుక కోసి తెచ్చిన వారికి 50 లక్షల రూపాయిల బహుమానం ఇస్తానని వీహెచ్ పీ షాజహాన్ పూర్ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్ కుమార్ అవస్థి ప్రకటించారు. దేశ సైన్యంపై విమర్శలు చేయడమే గొప్పతనంగా ఆజంఖాన్ భావిస్తున్నట్లుగా ఉన్నారని ఆయనకు తగిన గుణపాఠం చెప్తామని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/