Begin typing your search above and press return to search.
700 కోట్ల బ్లాక్ మనీ హాంగ్ కాంగ్ లో దాచేశాడు
By: Tupaki Desk | 28 Dec 2016 5:02 AM GMTబడాబాబుల నల్లధనం విషయంలో మరో షాకింగ్ న్యూస్. ఓ వజ్రాల వ్యాపారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడువందల కోట్ల రూపాయల బ్లాక్ మనీని ఎంచక్కా విదేశాల్లో జమ చేసుకున్నాడని తేలింది. ముంబై - నవీ ముంబైలోని రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - వజ్రాల దిగుమతి కంపెనీకి చెందిన ఐదు ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డిసెంబర్ 26న సోదాలు చేసింది. రెండు కంపెనీల డైరెక్టర్లకు చెందిన ఆధారాలు లేని పత్రాలను సీజ్ చేసింది. నవంబర్ లో రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్ దాదాపు రూ.700 కోట్లను హాంగ్ కాంగ్ కు తరలించిందని ఈడీ నిర్వహించిన విచారణలో తేలింది.
రాజేశ్వర్ ఎక్స్‌పోర్ట్స్ - తన అనుబంధ సంస్థలు వజ్రాలను దిగుమతి చేసుకుని డబ్బు చెల్లిస్తున్నట్లు ఈడీకి సమాచారం అందింది. వివిధ బ్యాంక్ ఖాతాల్లో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఈ సంస్థ డిపాజిట్లు చేసిందని ఈడీ అధికారులు తెలిపారు. రూ.700 కోట్లను హాంగ్ కాంగ్ కు అక్రమంగా రవాణా చేశారని తనిఖీలు నిర్వహించిన తరువాత వెల్లడైందని అధికారులు పేర్కొన్నారు. నల్లధనం తరలింపునకు నకిలీ కంపెనీలను సృష్టించారు. భారత్ లోని వివిధ బ్యాంకుల్లో 25 ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా హాంగ్ కాంగ్ లోని బ్యాంకు ఖాతాల్లో డబ్బును మళ్లించారని వారు చెప్పారు. రాజేశ్వర్ ఎక్స్ పోర్ట్స్ కు చెందిన ఇద్దరు డెరెక్టర్ల రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ప్రశాంత్ విజయ్ పవార్ - సుజాత ధన్ కుమార్ ఖార్గకు సంస్థ నెలకు చెరీ రూ.5000 ఇచ్చి డైరెక్టర్లుగా పెట్టింది. ఈ కంపెనీ ప్రధాన నిందితుడిని పట్టుకోవాల్సి ఉంది. డబ్బు ఎవరిదన్నదే తేలాల్సి ఉంది. ముంబైలోని హవాల ఏజెంట్ ఈ డబ్బును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఒక్క ప్రయత్నంలో దానిని హాంగ్ కాంగ్ కు తరలించాడని ఈడీ అధికారులు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/