Begin typing your search above and press return to search.

రాజగోపాల్ రెడ్డి కి చుక్కలు కనిపిస్తున్నాయా?

By:  Tupaki Desk   |   13 Sep 2022 6:38 AM GMT
రాజగోపాల్ రెడ్డి కి చుక్కలు కనిపిస్తున్నాయా?
X
బీజేపీ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో బాగా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న రాజగోపాల్ రాజీనామా చేయటంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్ళీ పోటి చేస్తుండటంతో ఆయనకు సమస్యలు బాగా పెరిగిపోతున్నాయట. ఇంతకీ మాజీ ఎంఎల్ఏకి ఎదురవుతున్న సమస్యలు ఏమిటి ?

ఏమిటంటే రెండు రకాలుగా ఉంటున్నాయట. మొదటిదేమో బీజేపీ పాతనేతల సహాయ నిరాకరణ. ఇక రెండోదేమో మాజీ ఎంఎల్ఏతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కొత్తనేతలకు పాత నేతలకు ఏ మాత్రం పడటం లేదట. ఈ రెండు సమస్యల ప్రభావం ప్రచారంపైన పడుతోందని సమాచారం. పార్టీలో అంతర్గతంగా సమస్యలు పెరిగిపోతుండటంతో రాజగోపాల్ కు సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఇదే విషయాన్ని మాజీ ఎంఎల్ఏ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫిర్యాదు కూడా చేశారట.

మొదటి సమస్య ఏమిటంటే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్నపుడు నియోజకవర్గంలోని బీజేపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లే వేయించారట. ఎంఎల్ఏ అత్యంత అవినీతిపరుడంటు వేయించిన పోస్టర్లను బీజేపీ నేతలు నియోజకవర్గమంతటా అతికించారట.

ఆయనకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారంచేశారు. అలాంటిది ఆయనిపుడు బీజేపీలో చేరగానే తాము ఎవరికి వ్యతిరేకంగా అయితే పోస్టర్లు వేసి ప్రచారం చేశామో ఆయనకే ఓట్లు వేయాలని ప్రచారం చేయటాన్ని ఒరిజినల్ బీజేపీ నేతలు చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నారట. ఈ కారణంతోనే రాజగోపాల్ ఎంత ప్రయత్నించినా చాలామంది ప్రచారానికి వెళ్ళటం లేదట.

ఇక రెండో సమస్య ఏమిటంటే బీజేపీలోని పాత నేతలకు రాజగోపాల్ తో పాటు చేరిన కొందరికి ఆధిపత్య గొడవలు మొదలయ్యాయిట. పైగా రాజగోపాల్ కూడా తాను చెప్పినట్లే అందరు వినాలని కండీషన్లు పెడుతున్నారట. దాంతో సహజంగానే మాజీ ఎంఎల్ఏతో వచ్చి చేరిన నేతలదే పెత్తనం జరుగుతోంది. దీన్ని ఒరిజినల్ బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.