Begin typing your search above and press return to search.

త‌మిళ‌ ఎన్నిక‌ల్లో `ర‌జ‌నీ`నే గెలిచారు.. మేధావుల మాట‌!

By:  Tupaki Desk   |   3 May 2021 5:30 PM GMT
త‌మిళ‌ ఎన్నిక‌ల్లో `ర‌జ‌నీ`నే గెలిచారు.. మేధావుల మాట‌!
X
కొన్ని నిర్ణ‌యాలు ముందు క‌ఠినంగా ఉన్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. వాటి ఫ‌లితం చ‌విచూశాక‌.. `ఆ నిర్ణ‌య‌మే మంచిదైంది` అనే కామెంట్లు వ‌స్తుంటాయి. అచ్చు అలాంటిదే.. త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది. ప్ర‌స్తు తం ఈ విష‌యం వైర‌ల్‌గా మారి.. నెటిజ‌న్లు.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక పార్టీలు పోటీ చేశాయి. వీటిలో సినీ రంగం నుంచి వ‌చ్చిన వారు కూడా పార్టీల త‌ర‌ఫున పొటీ చేశారు. న‌టి ఖ‌ష్బూ.. బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. విజ‌య్‌కాంత్ సొంత పార్టీ పెట్టుకుని ప‌రాజయం చ‌విచూశారు.

ఇక‌, క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ అట్ట‌ర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే.. ప్ర‌జ‌ల్లో రాజ‌కీయంగా విజ‌యం ద‌క్కించుకోవ‌డం వేరు.. వెండితెర‌పై న‌టించి.. సంపాయించుకునే అభిమానం వేరు. ఈ రెండి టిని క‌లిపి ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసిన న‌టులు.. ఫెయిల‌య్యారు. తాజాగా త‌మిళ‌నా ట వ‌చ్చిన ఎన్నిక‌ల ఫ‌లితం దీనినే రుజువు చేసింది. అయితే.. ఈ ఎన్నిక‌ల గోదా నుంచి ఆదిలోనే త‌ప్పు కొన్న త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. తాజాగా ఎన్నిక‌ల నుంచి భారీ ఉప‌శ‌మ‌నం పొందుతున్నార‌ని అంటున్నారు మేధావులు.

త‌న న‌ట‌న‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులను సంపాయించుకున్న ర‌జ‌నీ.. సొంత‌గా `మ‌క్క‌ల్ సేవా క‌ట్చి` అనే ఓ పార్టీ(స్వ‌చ్ఛంద సంస్ధ‌గా మార్చారు)ని పెట్టుకు న్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జ‌న‌వ‌రి 1న ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాన‌ని కూడా ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. పార్టీ గుర్తు, ఎన్నిక‌ల సింబల్ వంటివాటిపై క‌స‌ర‌త్తు చేశారు. త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది ఇత‌ర పార్టీల్లోని నేత‌లు కూడా ర‌జ‌నీ వైపు మొగ్గారు. దీంతో భారీ అంచ‌నాలు వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా ర‌జ‌నీ ఓ సినిమా షూటింగ్‌లో ఉండ‌గా.. అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. అనంత‌రం.. ఆయ‌న ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తాను పార్టీ పెట్ట‌డం లేద‌ని.. ఎన్నిక‌ల్లోకి దిగ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని.. ఇది దేవుడు చేసిన హెచ్చ‌రిక అని చెప్పుకొచ్చారు. అయితే.. అప్ప‌ట్లో ర‌జ‌నీపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఆయ‌న‌ను న‌మ్ముకుని వ‌చ్చిన నాయ‌కులూ ఒత్తిడి చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ర‌జ‌నీత‌న నిర్ణ‌యాన్ని మార్చుకోలేదు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు సినీ రంగం నుంచి వ‌చ్చి పార్టీ పెట్టుకున్న ఎవ‌రినీ కూడా త‌మిళ ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేదు. దీనిని బ‌ట్టి.. ర‌జ‌నీ తీసుకున్న నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.