Begin typing your search above and press return to search.
హిమగిరులకు తలైవా.. అందుకేనట
By: Tupaki Desk | 7 Oct 2017 7:28 AM GMTఅగ్ర హీరోలకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. పీచుల్లాంటి జుట్టును.. బట్టనెత్తిని కవర్ చేసుకోవటమంటూ అన్నది లేకుండా.. ఖరీదైన వస్త్రాలకు దూరంగా ఉంటూ సాదాసీదాగా ఉండటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. అందుకేనేమో.. రజనీ అంటే ఆయన అభిమానులు ఊగిపోతుంటారు.
ఉన్నది ఉన్నట్లుగా ఉండటానికి ఆయన అస్సలు వెనుకాడరు. లేనిది చూపించుకోవటానికి ఇష్టపడని రజనీ తీరు తమిళుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల కాలంలో అగ్రహీరోలంతా ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోకి వచ్చేందుకు మక్కువ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం మీద వస్తున్న కథనాలు అన్నిఇన్ని కావు. అయితే.. ఇంతకాలం రాజకీయ అరంగ్రేటం మీద ఆసక్తిని ప్రదర్శించనట్లుగా వ్యవహరించిన రజనీ.. ఈ మధ్య కాలంలో పార్టీ పెట్టే అంశంపై సానుకూలత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయన సతీమణి లతా రజనీకాంత్.. తన భర్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లుగా వెల్లడించారు. అయితే.. ఆయన ఎప్పుడు పార్టీ పెడతారన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి ముందు ఆయన హిమాలయాలకు వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురైనా.. మానసిక ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లటం రజనీకి అలవాటు.
ఇటీవల కాలంలో ఆరోగ్యం సరిగా లేని కారణంగా హిమాలయాలకు వెళ్లలేదు. తాజాగా తాను నటిస్తున్న కాలా మూవీ షూటింగ్ తర్వాత హిమాలయాలకు రజనీ వెళ్లనున్నట్లు చెబుతున్నారు. హిమాలయాల్లో తనకు నచ్చిన రీతిలో దైవ ధ్యానం తర్వాతనే తన రాజకీయ అరంగ్రేటానికి సంబంధించిన అంశాల్ని అధికారికంగా వెల్లడిస్తారని చెబుతున్నారు. ఈ తరహా రాజకీయ ప్రకటన రజనీకి మాత్రమే సాధ్యమేమో?