Begin typing your search above and press return to search.
రజనీ విషయంలో ఆలస్యం.. అమృతమేనట!
By: Tupaki Desk | 12 May 2019 5:43 AM GMTకొన్ని సామెతలు ఎవర్ గ్రీన్. అలాంటి వాటిల్లో ఒకటి.. ఆలస్యం అమృతం.. విషం. అయితే.. ఈ సామెతెను సగం మాత్రమే తీసుకుంటున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యానారాయణ రావ్. తన సోదరుడి పొలిటికల్ ఎంట్రీ మీద తరచూ మాట్లాడే ఆయన.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు.. రాజకీయ నేతలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఊరిస్తూ.. ఊసురుమనిపించే రజనీ తీరు ఆయన ఫ్యాన్స్ ను నిరాశలో ముంచెత్తుతోంది. వాస్తవానికి తాజా సార్వత్రిక ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని భావించారు. కానీ.. ఆయన అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే మే 23న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని వెల్లడించటం విశేషం
రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ అంతకంతకూ లేటు కావటంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. రజనీ సోదరుడు మాత్రం వాటిని కొట్టిపారేస్తూ.. రజనీ లేట్ ఎంట్రీ ఆయనకు అమృతంగా మారుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నో కార్యక్రమాల్ని డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు.
రాజకీయాల్లోకి రజనీ రావటం తథ్యమన్న ఆయన.. రాజకీయ రంగప్రవేశం లేట్ కావొచ్చుకానీ.. ఆయన ఎంట్రీ లేటెస్ట్ గా ఉంటుందన్న మాటను చెప్పారు. తాజాగా తిరుచ్చి.. ఒలైయూర్ సమీపంలోని కుమారమంగళంలో రజనీ తల్లిదండ్రులకు ఆయన అభిమానులు స్మారక మంటపాల్ని కట్టించారు. రెండు నెలల క్రితం దీన్ని ప్రారంభించారు. వీటిల్లో మండల పూజ కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఇందులో పాల్గొనటానికి వచ్చిన ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి రజనీ రాజకీయ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఫలితాలు వెల్లడయ్యే రోజున.. ఆ హోరులో రజనీ రాజకీయ ఎంట్రీ అనౌన్స్ మెంట్ కు ప్రాధాన్యత లభిస్తుందంటారా? కావాలనే రజనీ ఆ పని చేస్తున్నారా? లేక మరేదైనా వ్యూహం ఉందా?