Begin typing your search above and press return to search.

ఆ డైలాగ్స్ సూప‌ర్ హిట్‌..మ‌రి..ర‌జ‌నీ పొలిటికల్ డైలాగ్స్‌..?

By:  Tupaki Desk   |   31 Dec 2017 10:30 AM GMT
ఆ డైలాగ్స్ సూప‌ర్ హిట్‌..మ‌రి..ర‌జ‌నీ పొలిటికల్ డైలాగ్స్‌..?
X
ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒక సూప‌ర్ స్టార్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా? రాడా? అన్న సందేహాలు కంటిన్యూ కావ‌టం.. ఆ హైప్ అంతేలా కొన‌సాగ‌టం మామూలు విష‌యం కాదు. అది ర‌జ‌నీ విష‌యం నూటికి నూరుపాళ్లు నిజ‌మ‌య్యాయి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌మిళ సినిమాకు సూప‌ర్ స్టార్ గా కీర్తిని అందుకుంటున్న ర‌జ‌నీ లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వ‌స్తే స‌మాజానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. త‌మిళ‌నాడు రాష్ట్రం మ‌రింత ముందుకు వెళుతుంద‌న్న ఆశ‌లు చాలామందే వినిపిస్తుంటారు.

అయితే.. అభిమానులు త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎంత‌గా కోరుకున్నా.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టమే త‌ప్పించి.. నోరు తెరించింది ఒక్క మాట చెప్పింది లేదు. కానీ.. రాజ‌కీయాలంటే త‌న మ‌న‌సులో ఉన్న ఆస‌క్తిని.. కుతూహ‌లాన్ని త‌న సినిమాల్లో డైలాగ్స్ రూపంలో చెప్పేవారు. సినిమాల్లో ఆయ‌న పంచ్ డైలాగ్స్ తో ఆయ‌న అభిమానులే కాదు.. సినిమా అభిమానులు సైతం సంతోషాన్ని వ్య‌క్తం చేసేవారు.

వెండితెర వేల్పుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అందుకుంటున్న ర‌జ‌నీ.. త‌న సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగ్స్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యాయి. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న రాజ‌కీయ జీవితం మొద‌లైన‌ట్లే. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. సొంతంగా పార్టీ పెడ‌తాన‌ని చెప్పిన ర‌జ‌నీ.. వాటికి సంబంధించిన వివ‌రాల్ని ప్ర‌క‌టించ‌లేదు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌రిలోకి దించుతాన‌ని చెప్ప‌టం ద్వారా.. 2019 స్వార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు తాను దూరంగా ఉంటాన‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

సినిమాల్లో ర‌జ‌నీ చెప్పిన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్ష‌కులు ఎంతగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారో తెలిసిందే. మ‌రి.. రాజ‌కీయ జీవితంలో ర‌జ‌నీ నోటి నుంచి వ‌చ్చే డైలాగులు మ‌రెంత హిట్ అవుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. రాజ‌కీయ ఎంట్రీ నేప‌థ్యంలో.. త‌న‌దైన శైలిలో చెప్పిన ర‌జ‌నీ సూప‌ర్ హిట్ డైలాగ్స్ ను ఒక్క‌సారి గుర్తు చేసుకోవ‌టం బాగుంటుంది.

+ నా దారి... రహదారి

+ నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే

+ నాన్న పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది

+ దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు

+ అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు

+ పుట్టుకతో వచ్చింది.. ఎన్నటికీ పోదు

+ నాయకుడికి బంధం, బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు

+ ఒక పిరికివాడితో యుద్ధం చేయటం నాకు.. మానిక్ భాషాకి నచ్చదు

+ కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడుకుండా వచ్చింది ఏదీ ఉండదు

+ పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు.. ఇంకా దేనికయ్యా నీదీ నాదీ అనే స్వార్థం

+ తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత

+ ధనమంతా నీ దగ్గరే ఉంటే మనఃశాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావల్సినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తేనే మనఃశాంతి