Begin typing your search above and press return to search.

ర‌జ‌నికీ ముందు నుయ్యి వెనుక గొయ్యి

By:  Tupaki Desk   |   17 Feb 2018 10:08 AM GMT
ర‌జ‌నికీ ముందు నుయ్యి వెనుక గొయ్యి
X
సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నికీ ప‌రిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా త‌యారైంది. గ‌త శుక్ర‌వారం కావేరీ న‌దీ జ‌లాల‌ విష‌యం పై సుప్రింకోర్టు తీర్పించింది. త‌మిళ‌నాడుకు గ‌తంలో విడుద‌ల చేస్తున్న 198టీఎంసీల కంటే త‌క్కువ‌గా 177టీఎంసీల నీరు విడుద‌ల చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై త‌మిళ‌నాడు కు అన్యాయం జ‌రిగింద‌ని హీరో క‌మ‌ల్ హాస‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇదే విష‌యం పై త‌లైవా అభిమానులు ఒత్తిడి చేయ‌డంతో ఈ తీర్పు వ‌ల్ల త‌మిళ‌నాడుకు అన్యాయం జ‌రిగింద‌ని ర‌జ‌నీ అన్నారు.

అంతే ర‌జ‌నీ వ్యాఖ్య‌ల‌పై క‌ర్నాట‌క ప్ర‌జ‌లు రైతులు మండిప‌డుతున్నారు. క‌ర్నాట‌క ద్రోహి ర‌జ‌నీకాంత్ అని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. అంతేకాదు అమ్మ‌కు అన్నం పెట్టడం చేత‌కాదు కానీ పిన్నికి బంగారు గాజులు చేయిస్తాడా..? ఈ ర‌జ‌నీ అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న సినిమాలు విడుద‌ల కాకుండా అడ్డుకుంటామ‌ని, త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల్ని మోసం చేయ‌డానికే కావేరీ జ‌లాల పంపిణి విష‌యం ర‌జ‌నీ రాజ‌కీయం చేస్తున్నార‌ని సూచించారు. కావేరీ జ‌లాల విష‌యం లో ర‌జ‌నీ ప‌రిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.