Begin typing your search above and press return to search.
రజినీని కెలికాడు.. దిమ్మదిరిగేలా ఉంది
By: Tupaki Desk | 18 April 2016 5:06 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ మొదట రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు అతడికి దిమ్మదిరిగే షాకిచ్చారు ఓటర్లు. కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే అతడికి కట్టబెట్టారు. కానీ తర్వాతి ఎన్నికలకు పుంజుకుని 28 సీట్లు సంపాదించి.. జయలలిత ప్రభుత్వంలో భాగస్వామి కూడా అయ్యాడు కెప్టెన్. విజయ్ కాంత్ రియల్ హీరో అంటూ అందరూ పొగిడారు. కానీ ఆయన మళ్లీ జీరో కావడానికి ఎంతో సమయం పట్టలేదు. జయతో కయ్యం పెట్టుకుని.. ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేయడమే కాక.. అనేక సందర్భాల్లో తాగి ఇష్టానుసారం వాగడం.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ఆయన ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ఇప్పటిదాకా జరిగిన డ్యామేజ్ చాలదన్నట్లు లేటెస్టుగా రజినీకాంత్ మీద విమర్శలు గుప్పించి.. పెద్ద వివాదంలోనే ఇరుక్కున్నాడు విజయ్ కాంత్.
తాను రజినీ లాగా ఎవ్వరికీ బెండ్ అవ్వనని.. రాజకీయాల నుంచి పారిపోనని విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలపై సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. ఏ వివాదం లేకుండా తన పని తాను చేసుకుపోయే రజినీకాంత్ ను కెలకడం సామాన్యులకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది. రజినీకాంత్ మూలాల గురించి కూడా విజయ్ కాంత్ ప్రశ్నించడం మరింత వివాదాన్ని రాజేస్తోంది. రజినీ మరాఠా వాడన్న ఉద్దేశంతో విమర్శించిన విజయ్ కాంత్ కూడా ఓ తెలుగు వాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చెన్నైలో పలుచోట్ల విజయ్ కాంత్ దిష్టిబొమ్మను రజినీ అభిమానులు దహనం చేసి నిరసన తెలిపారు. ఈ వివాదంపై రజినీ ఏం స్పందించకపోయినప్పటికీ.. ఆయన అభిమానులెవ్వరూ విజయ్ కాంత్ పార్టీకి ఓటేసే పరిస్థితి కనిపించడం లేదు. అధికారపక్షం అన్నాడీఎంకేనో.. విపక్షం డీఎంకేనో విమర్శించకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రజినీని విమర్శించి విజయ్ కాంత్ ఏం బావుకోవాలనుకున్నాడన్నదే అర్థం కావడం లేదు.