Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు కాలా సెన్సార్ పూర్తి
By: Tupaki Desk | 3 April 2018 11:16 AM GMTతమిళనాట ఇంకా థియేటర్ల బంద్ కొనసాగుతోంది. మార్చిలో విడుదల కావల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు బంద్ ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలో థియేటర్లతో తమిళ బొమ్మ పడుతుందనే ఆశపడుతున్నారు తమిళ తంబీలు. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ‘రోబో 2.0’ వాయిదా పడడంతో ఆ డేటును రిప్లేస్ చేసింది ‘కాలా’ చిత్రం. ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం... ఎట్టకేలకు ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంది.
సినిమా మొత్తంలో 14 సీన్లు కత్తిరించమని చెప్పిన సెన్సార్ బోర్డ్ సూచనలకు చిత్ర యూనిట్ అంగీకరించడంతో... యూ/ ఎ సర్టిఫికెట్ లభించింది. పెద్దల సమక్షంలో పిల్లలు కూడా ఈ సినిమాను చూడవచ్చు. ఈ మధ్యనే విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. దాంతో చిత్ర రిజల్ట్ పై భారీ అంచనాలే పెట్టుకుంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. రజినీ కాంత్ ‘కరికాలుడు’ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ హుమా కురేషీ, విలక్షణ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రజినీ అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించి... తన సొంత సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ‘కాలా’ సినిమాను నిర్మించాడు.
‘కబాలి’ చిత్ర దర్శకుడు పి. రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే తమిళనాడులో థియేటర్ల సమ్మె కారణంగా వాయిదా పడిన సినిమాలకు మొదట రిలీజ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది తమిళనాడు నిర్మాతల సంఘం. దీంతో ఇప్పటికే సెన్సార్ ముగించుకుని విడుదలకు ఎదురుచూస్తున్న సినిమాలు విడుదలయ్యాక రజినీకి అవకాశం వస్తుంది. విడుదలకి ఇంకా నెలకు పైనే సమయమున్నా... థియేటర్ల బంద్ ఎన్ని రోజుల్లో ముగుస్తుందనే దానిపైనే కాలా విడుదల తేదీ ఆధారపడి ఉంది.