Begin typing your search above and press return to search.

రజనీమండ్రమ్‌.కామ్..త‌లైవా ట్వీట్..వైర‌ల్!

By:  Tupaki Desk   |   1 Jan 2018 3:02 PM GMT
రజనీమండ్రమ్‌.కామ్..త‌లైవా ట్వీట్..వైర‌ల్!
X
త‌లైవా రాజ‌కీయ ప్ర‌వేశం త‌మిళ‌నాట ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. త‌మిళ సూప‌ర్ స్టార్ అరంగేట్ర ప్ర‌క‌ట‌న‌ ప‌లు రాజ‌కీయ పార్టీల‌లో గుబులు పుట్టిస్తోంది. ర‌జ‌నీ....లేట్ గా వ‌చ్చినా లేటెస్ట్ గా  రాజ‌కీయాల్లోకి రాబోతున్నాడు. త‌న పార్టీ స్థాప‌న కోసం త‌లైవా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాడు. త‌న కొత్త పార్టీకోసం వ్యూహ‌ర‌చ‌న మొద‌లు పెట్టాడు. అందుకోసం ర‌జ‌నీ టెక్నాల‌జీని వాడుకుంటున్నాడు. తాజాగా, ఆస‌క్తా గ‌ల వారంతా త‌న పార్టీలో వాలంటీర్లుగా చేరాల‌ని త‌లైవా పిలుపునిచ్చారు. అందుకోసం ఓ వెబ్‌ సైట్ తో పాటు యాప్ ను విడుద‌ల చేశారు. త‌లైవా.... `రజనీమండ్రమ్‌.కామ్‌` అనే వెబ్‌ సైట్ ను ప్రారంభించి త‌న  ప్ర‌సంగ వీడియోను  పోస్ట్ చేశారు. రాజ‌కీయాల్లోకి త‌న‌ను స్వాగ‌తించిన అభిమానులకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో మార్పున‌కు - న‌వ‌స‌మాజ నిర్మాణానికి ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఆ వీడియోను ర‌జ‌నీ త‌న ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. అయితే, ఆ వీడియాలోర‌జ‌నీ త‌న పార్టీ పేరు - లోగో వంటి విష‌యాల‌ను మాత్ర ప్ర‌క‌టించ‌లేదు. ర‌జ‌నీ పోస్ట్ చేసిన కొద్ది సేప‌టికే ఆ వీడియో వైర‌ల్ అయింది. ర‌జ‌నీ రాజ‌కీయ అరంగేట్రంపై నెటిజ‌న్లు అదిరిపోయే పంచ్ డైలాగుల‌తో కామెంట్లు పెడుతున్నారు.

ర‌జ‌నీ రాజ‌కీయప్ర‌వేశ ప్ర‌క‌ట‌నపై మీడియాతో పాటు సోష‌ల్ మీడియాలో కూడా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ.... త‌లైవా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంపై ర‌క‌ర‌కాల ఫ‌న్నీ కామెంట్లు - ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ``ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాలేదు... రాజ‌కీయాలే ర‌జ‌నీకాంత్ లోకి వ‌చ్చాయి`` అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు. ``ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు... మిగ‌తా రాజ‌కీయ నాయ‌కులారా మీ కుర్చీలు జాగ్ర‌త్త‌గా ఒడిసి ప‌ట్టుకోండి`` అంటూ మ‌రొక‌రు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ``మామూలు మ‌నుషులు న్యూఇయ‌ర్ రోజు పార్టీకి వెళ్తారు... కానీ ర‌జ‌నీకాంత్ పార్టీ పెడ‌తాడు`` అంటూ మ‌రొక‌రు.....``ర‌జ‌నీ రాజ‌కీయ‌ప్ర‌వేశం వార్త విని - రాహుల్ గాంధీ బ్యాంకాక్ పారిపోయాడు`` అని ఇంకొక‌రు.....``ర‌జ‌నీ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటే....ఏ బ‌ట‌న్ నొక్కినా ర‌జ‌నీ పార్టీకే ఓటు ప‌డిపోతుంది.. అది త‌లైవా ప‌వ‌ర్‌`` అంటూ మ‌రో వీరాభిమాని ట్వీట్ చేశారు.