Begin typing your search above and press return to search.
పార్టీ పెట్టలేదు.. మిత్రపక్షం మాత్రం రెఢీ!
By: Tupaki Desk | 25 Sep 2018 6:02 AM GMTఅదిగో వస్తున్నాడన్నారు. ఇదిగో వచ్చేశాడన్నారు. అందరి మాట ఎలా ఉన్నా.. తాను రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమని తేల్చేశారు. ఆ అంటే ఆర్నెల్లు అన్నట్లుగా ఉంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహారం చూస్తుంటే. సార్వత్రిక ఎన్నికలకు మరో ఎడెనిమిది నెలలు మాత్రమే ఉన్న వేళ.. ఇప్పటికి పార్టీని స్టార్ట్ చేసే విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రజనీ.
ఇప్పుడు కానీ రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తే కానీ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే.. పార్టీ పెట్టే విషయంలో క్లారిటీ వచ్చేసినా.. ఎప్పుడు పెడతారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పాలి. ఇదిలా ఉండగా.. రజనీ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన సన్నిహితుడు కమ్ పుదియనీతి కట్చి వ్యవస్థాపకుడు ఏసీ షణ్ముగం.
తాజాగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లుగా వెల్లడించారు. ఈ డిసెంబరుకు పార్టీ కచ్ఛితంగా పెడతారన్న ఆయన.. పార్టీ పెట్టే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. తమ పార్టీ రజనీ పార్టీతోనే సాగుతుందని వెల్లడించారు. మొత్తానికి రజనీ పార్టీని అధికారికంగా ప్రకటించకున్నా.. రజనీ పార్టీకి మిత్రపక్షం ఒకటి మాత్రం రెఢీగా ఉందన్నమాట.