Begin typing your search above and press return to search.
అమ్మ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్న రజనీ
By: Tupaki Desk | 28 May 2017 9:29 AM GMTఅధికార పక్షంగా ఉంటే ఆ ధీమానే వేరుగా ఉంటుంది. కానీ.. పరిస్థితి తాజాగా అలాంటి చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది తమిళనాడు అధికార పక్షమైన అన్నాడీఎంకే అలియాస్ అమ్మ పార్టీ. కొన్నేళ్లుగా తన పొలిటికల్ ఎంట్రీపై వెల్లువెత్తుతున్న ఊహాగానాలపై స్పందించని రజనీకాంత్.. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించటం తమిళనాడు అధికారపక్షానికి కొత్త చిక్కుల్ని తీసుకొస్తోంది.
దేవుడు ఆదేశిస్తే తానేం చేయటానికైనా సిద్ధమని చెప్పిన రజనీ.. తాజాగా పార్టీ పెట్టే విషయం మీద పాజిటివ్ గా ఉండటమే కాదు.. తన రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన కీలక అంశాల్నిత్వరలో ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రజనీ దెబ్బకు అమ్మ పార్టీ హడలిపోతోంది.
అమ్మ మరణం.. ఆపై చిన్నమ్మపై పార్టీలో తలెత్తిన సంక్షోభం.. పన్నీర్ తిరుగుబాటు.. ఇలా ఇప్పటికే రకరకాల సమస్యలతో తల్లడిల్లుతున్న అన్నాడీఎంకే అధినాయకత్వానికి రజనీకాంత్ ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నారు. రజనీ కానీ పార్టీ పెట్టిన పక్షంలో అమ్మ పార్టీ నుంచి అర్జెంట్ గా పరుగులు తీసి మరీ ఆయన పార్టీలో చేరటానికి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న అమ్మ పార్టీ ఎమ్మెల్యేలు రజనీ రాజకీయ రంగప్రవేశం కానీ చేస్తే.. ఇప్పుడున్న పరిస్థితులు అస్సలు ఉండవని చెబుతున్నారు.
అమ్మ మరణం తర్వాత అమ్మ పార్టీ నిట్టనిలువుగా చీలిపోవటం ఒక ఎత్తు అయితే.. పళనిస్వామి సీఎం అయ్యాక పార్టీలో మొత్తం మూడు వర్గాలు ఉన్నాయని.. వారంతా ఇప్పుడు రజనీ పేరు చెప్పి పళనిస్వామిని బ్లాక్ మొయిల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమ డిమాండ్లను తీర్చకుంటే తమ దారిన తాము పోతామన్న మాటను నేతలు తరచూ చెప్పటం ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో.. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అవసరమైతే పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేసి రజనీ గూటికి చేరిపోవటానికి ఎమ్మెల్యేలు పలువురు సిద్ధంగా ఉన్నారంటున్నారు. అయితే.. రజనీ రాజకీయ ఎంట్రీ పేరుతో పలువురునేతలు సీఎం పళనిస్వామిని బ్లాక్ మొయిల్ చేస్తున్నారంటూ చెబుతున్న మాటల్లో నిజం లేదని చెబుతున్నారు.
సినిమా రంగంలో సంపాదించింది చాలక .. మరింతగా దోచుకోవటానికే రాజకీయాల్లోకి రజనీ వస్తున్నారా? అంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మ పార్టీలో మంత్రిగా వ్యవహరిస్తున్న సెల్లూర్ రాజు స్పందన మాత్రం భిన్నంగా ఉంది. చిన్నమ్మకు అత్యంత సన్నిహితుడైన ఆయన.. రజనీకి వీరాభిమాని. అయితే.. వ్యక్తిగతంగా ఉండే అభిమానానికి రాజకీయానికి లింకు లేదని చెప్పటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఎవరు అవునన్నా.. కాదన్నా రజనీ రాజకీయ రంగప్రవేశంతో అమ్మ పార్టీకి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. తీవ్రమైన జనాకర్షణ కొరత ఉన్న అమ్మ పార్టీకి రజనీ శాపంగా మారటం ఖాయమంటున్నారు. రజనీ పార్టీ పెట్టిన తర్వాత.. అమ్మ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు జంప్ కావటం ఖాయమని.. పరోక్షంగా పళినిస్వామికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. పళనిస్వామి టైం ఎంత బ్యాడ్ అన్నది.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపైనే ఆధారపడి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/