Begin typing your search above and press return to search.
ఈ ఫొటో సెషన్ల తమాషా ఏంటి రజినీ సార్
By: Tupaki Desk | 15 Dec 2017 8:33 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయా అరంగేట్రం గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. ఇదిగో అదిగో అన్నట్లే కనిపిస్తున్నాడు కానీ.. దాని సంగతి ఎటూ తేల్చట్లేదు రజినీ. ఈ ఏడాది ఆరంభంలో రజినీ రాజకీయారంగేట్రం గురించి బాగా హడావుడి జరిగింది. అప్పుడాయన తన అభిమానులతో వరుసగా మూణ్నాలుగు రోజులు సమావేశమై.. పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ పిలుపు ఇవ్వడంతో ఇక రాజకీయ గోదాలోకి దూకడమే తరువాయి అనుకున్నారు. ఆ సందర్భంగా వందల మంది అభిమానులతో ఫొటోలు దిగడమే కాక.. వారిలో ఉత్సాహం నింపేలా మాట్లాడారు రజినీ. సూపర్ స్టార్ సోదరుడు సైతం త్వరలోనే రజినీ పార్టీ పెడతారంటూ ప్రకటన చేయడం అభిమానుల్లో ఉత్సాహం పెల్లుబికింది.
కట్ చేస్తే.. నెలలు నెలలు గడిచిపోయాయి. రజినీ రాజకీయారంగేట్రం గురించి ఏ చప్పుడే లేదు. మొన్న రజినీ పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడేమో ఈ నెల 26 నుంచి నాలుగైదు రోజుల పాటు రజినీ మళ్లీ అభిమానులతో సమావేశం నిర్వహించబోతున్నారట. ఈ సమావేశం దేనికట అంటే.. అభిమానులతో ఫొటోలు దిగడానికట. ఈసారి మరింత మంది అభిమానులకు తనతో ఫొటోలు దిగే అవకాశమిస్తాడట రజినీ. ఐతే ఇంతకుముందు ఫొటో సెషన్ అంటే దాని గురించి మీడియా వాళ్లు కూడా సానుకూలంగానే తీసుకున్నారు కానీ.. రాజకీయ ప్రవేశం గురించి గత కొన్ని నెలల్లో ఏమీ తేల్చకుండా అందరినీ అయోమయంలోకి నెట్టేసి.. మళ్లీ ఇప్పుడు ఫొటో సెషన్ అనేసరికి దీన్ని కామెడీగా తీసుకుంటున్నారు. తెరమీద ఎంతో ధైర్యవంతుడిలా.. ఫెరోషియస్ గా కనిపించే రజినీ నిజ జీవితంలో ఇంత బలహీనుడేంటి అంటూ ఆయనపై సెటైర్లు పడుతున్నాయి. ఆయన్ని ఒక పిరికివాడిగా జమ కడుతున్నారు. కనీసం తాను రాజకీయాల్లోకి రావట్లేదని అయినా ఆయన ఒక స్టేట్మెట్ ఇచ్చి ఊరుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.