Begin typing your search above and press return to search.

వెంకయ్య - అమిత్ షా.. రజినీ విసిరిన పంచ్ కథ

By:  Tupaki Desk   |   11 Aug 2019 11:45 AM GMT
వెంకయ్య - అమిత్ షా.. రజినీ విసిరిన పంచ్ కథ
X
ఆధిపత్యం - అధికారం రాజకీయాల్లో చాలా చెడ్దదంటారు.. నిజమే.. రాజకీయాల్లో ఎదగాలంటే పక్కోళ్లను తొక్కుకుంటూ వెళ్లాలంటారు. అడ్డువచ్చిన వారిని అథ: పాతాళానికి పంపాలంటారు.. ఒక గొప్ప నేతగా ఎదగాలంటే ఎన్ని చూసి ఉండాలి.. ఎన్ని కేసులు ఎదుర్కోవాలి... ఎన్ని ఉపద్రవాల్లో నిలిచి ఉండాలి.. అయితే కొత్త నీరు రాకతో రాజకీయాల్లో పాత నీరు పోవాల్సిందే.. పోకున్నా పంపించేస్తుంటారు.. బీజేపీలో అదే జరిగింది..

బీజేపీలోకి కొత్తనీరు మోడీషాలు వచ్చి సీనియర్లు అద్వానీ - మురళీ మనోహర్ జోషి సహా చాలా మందికి ఎసరుపెట్టారు. వారిని ఉత్సవ విగ్రహంలా మార్చేశారు. 70 ఏళ్ల వయసు దాటారని నిబంధన పెట్టి వారికి రిటైర్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడంతా మోడీ షాలదే రాజ్యం..

ఇక మోడీ గత కేబినెట్ లో మోడీషాల ఆధిపత్యాన్ని ఎదురించేలా యాక్టివ్ గా కీరోల్ పోషించిన వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేసి ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టారని.. ఉత్సవ విగ్రహంలా మార్చేశారన్న విమర్శలు వచ్చాయి. వెంకయ్య కూడా ఎన్నో సందర్భాల్లో ఇష్టం లేని ఉపరాష్ట్రపతి పదవి అంటూ ఈసడించారు.

అయితే వెంకయ్యకు ఆధ్యాత్మికతకు పెద్దగా సంబంధం లేదు. అయితే సాహిత్యం - కళలు - సినిమాలంటే వెంకయ్యకు చాలా ఇష్టం. అయితే తాజాగా వెంకయ్యనాయుడుపై రాసిన ‘లిజనింగ్ - లెర్నింగ్ అండ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వెంకయ్య - అమిత్ షా - రజినీకాంత్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైక్ అందుకున్న రజినీకాంత్ బీజేపీ పాలిటిక్స్ కు వెంకయ్య బలైపోయారనేలా ఇన్ డైరెక్ట్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి.

రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారు.. రాజకీయాల్లోకి రాకుండా ఆధాత్మిక రంగం వైపు వెళ్లి ఉంటే గొప్ప మార్గదర్శకుడు అయ్యి ఉండేవారు. అలాంటి ఆధ్యాత్మికవేత్తను తాము పోగొట్టుకున్నాం’ అని రజినీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సభకు సంబంధం లేకుండా రజినీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక వేదికపై ఉన్న అమిత్ షా - వెంకయ్య కాసేపు ఖన్నులై ఆ తర్వాత సరదాగా నవ్వుకున్నారు.

అయితే రజినీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.. ఎంతో యాక్టివ్ - తలపండిన రాజకీయ నేత అయిన వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేసి ఉత్సవ విగ్రహంలా మార్చిన మోడీషాల తీరును ఎండగట్టేందుకే ఇలా రజనీకాంత్ మాట్లాడి ఉండవచ్చన్న చర్చ తమిళనాట సాగుతోందట. అదీ ఇప్పుడు కేంద్రంలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న అమిత్ షా ముందే అనడంతో ఈ వ్యాఖ్యల వెనుక పరామర్థం ఇదేనంటూ చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా అమిత్ షా వేదికపై ఉండగానే రజినీకాంత్ వాత పెట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.