Begin typing your search above and press return to search.

స్టాలిన్ వైపు.. ర‌జ‌నీకాంత్ చూపు..!

By:  Tupaki Desk   |   19 May 2017 10:45 AM GMT
స్టాలిన్ వైపు.. ర‌జ‌నీకాంత్ చూపు..!
X
త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్ స‌స్పెన్స్‌ను కొన‌సాగిస్తున్నాడు. రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా రాడా అన్న‌ది నేరుగా చెప్ప‌కుండా.. రోజుకో ట్విస్ట్‌ తో ర‌జనీ ఉత్కంఠ పెంచుతున్నాడు. తాజాగా ఐదో రోజు అభిమానుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా ర‌జ‌నీ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అయితే వీటిని నిశితంగా గ‌మ‌నిస్తే విప‌క్ష నేత స్టాలిన్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ఉంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

అభిమానుల‌తో ర‌జ‌నీ మాట్లాడుతూ...మ‌న ద‌గ్గ‌ర మంచి నాయ‌కులు ఉన్నా.. వ్య‌వ‌స్థ స‌రిగా లేక వాళ్లు ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని అన్నాడు. ఇలా చెబుతూ.. అత‌ను డీఎంకే నేత, విప‌క్ష నాయకుడు స్టాలిన్ పేరు చెప్ప‌డం ఆస‌క్తి రేపుతోంది. ``త‌మిళ రాజ‌కీయాల్లోనూ స్టాలిన్‌ - అన్బుమ‌ని రాందాస్‌ - తిరుమ‌వ‌ల‌వ‌న్‌ లాంటి మంచి నేతలు ఉన్నా.. వ్య‌వ‌స్థ వారిని స‌రిగా ప‌నిచేయ‌నివ్వ‌డం లేదు. స్టాలిన్ స‌మ‌ర్థుడే ఆయ‌న కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నారంటే దానికి కార‌ణం వ్య‌వ‌స్థే`` అని ర‌జనీ అన్నాడు. ఈ సంద‌ర్భంగానే వ్య‌వ‌స్థ మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ముఖ్యంగా ప్ర‌జ‌ల మైండ్‌ సెట్ మారాల‌ని ర‌జ‌నీ స్ప‌ష్టంచేశారు.

త‌మిళ పాలిటిక్స్‌లో అతిపెద్ద వైఫ‌ల్యం ర‌జ‌నీ అని బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి చేసిన కామెంట్ల‌కు కూడా ర‌జ‌నీప‌రోక్షంగా చుర‌కలంటించారు. ``నాకు కొన్ని బాధ్య‌త‌లు - ప‌నులు ఉన్నాయి. మీకూ ప‌నులు ఉంటాయి. అవి చేస్తూనే అంతిమ యుద్ధం వ‌చ్చిన‌పుడు ఏం జ‌రుగుతుందో చూద్దాం` అంటూ ర‌జ‌నీ అన‌డం చూస్తుంటే అత‌ను రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని చెప్తున్నారు. అయితే స్టాలిన్‌ ను పొగ‌డ‌టం చూస్తుంటే.. డీఎంకే వైపు మొగ్గుతాడా అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే బీజేపీ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అన్నా డీఎంకే ర‌జ‌నీకి మొద‌టి నుంచి అత‌నికి అస‌లు ప‌డ‌దు. ఇక త‌మిళ‌నాడులో మిగిలిన పెద్ద పార్టీ డీఎంకే మాత్ర‌మే. ఈ ఊహ‌లు ఫ‌లింలిచి ర‌జ‌నీ డీఎంకే వైపు చూస్తే మాత్రం త‌మిళ రాజ‌కీయాల్లో పెను మార్పులు ఖాయమ‌ని విశ్లేష‌కులు ఘంటాప‌థంగా చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/