Begin typing your search above and press return to search.
రజినీ ఆ విషయం లో నోరు జారారా ...లేక వ్యూహం లో భాగమేనా ?
By: Tupaki Desk | 25 Jan 2020 9:38 AM GMTతమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. రజినీ సినిమా విడుదల అవుతుంది అంటే అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక సినిమాల గురించి పక్కన పెడితే రజినీ చాలా మంచి మనిషి. ఎప్పుడూ కూడా సహనం కోల్పోకుండా , వివాదాలకు ఆమడ దూరంలో నడుస్తూ కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో రియల్ సూపర్ స్టార్ గా నిలిచి పోయారు. కానీ, గత కొన్ని రోజులుగా మాత్రం రజినీ చుట్టూ అనేక వివాదాలు తిరుగుతున్నాయి. అలాగే ఎన్నడూ లేని విధముగా రజినీ పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తమిళులు ఆరాధ్య దైవంగా భావించే పెరియార్ రామస్వామిపై రజనీకాంత్ చేసిన సంచలన వ్యాఖ్యలు.
తమిళనాట ద్రవిడ పార్టీల పుట్టిన నాటి నుంచి నేటి వరకు అదే వాదం అక్కడ రాజ్యమేలుతోంది. అలాంటి ద్రవిడ సిద్దాంతాల పితామహుడు పెరియార్ పై రజనీ కామెంట్ ఎందుకు చేశారు. అసలు ఆ సాహసం చేయడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా.. లేక ఎదో మాట్లాడుతున్న సమయంలో సందర్భోచితంగా ఆలా అన్నారా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు కొంచెం భిన్నం అని చెప్పాలి..అక్కడ మనుగడ సాధించాలి అంటే ఏ పార్టీ అయినా కూడా ద్రావిడ సిద్దాంతాలకి జై కొట్టాల్సిందే.
వివాదాలకు దూరంగా ఉండే తలైవా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన నేపథ్యంలో అయన అభిమానులు కూడా ఆలోచనలో పడ్డారు. ఒక ప్రైవేట్ కార్యక్రమ వేదిక.. ఆ వేదికపై రజనీకాంత్ చేసిన కామెంట్స్ తమిళనాడు మొత్తం దూమారానికి కారణమైంది. అసలు,రజినీ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ? ప్రముఖ మాగ్జైన్ తుగ్లక్ 50 వ వార్షికోత్సవ వేడుకలు ఇటీవల చెన్నైలో జరిగాయి.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.. ‘చో రామస్వామి’ నేతృత్వంలో నడిచిన ఈ మ్యాగజైన్ ఎన్నో సంచలనాలకు వేదిక అయిందని అన్నారు.. 1971 లో సీతారాములకు వ్యతిరేకంగా పెరియార్ రామస్వామి ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. సీతా రాముల ఫోటోకు చెప్పుల దండలు వేసి మరీ నిరసన తెలిపారు.. ఆ విషయాన్ని ఎవరూ వార్తగా ప్రచురించడానికి ముందుకు రాని ఈ పరిస్థితుల్లో చో రామస్వామి తుగ్లక్ పత్రికలో ఆ వార్తను ప్రచురించే సాహసం చేశారని .. అది రామస్వామి తెగువ అని పొగిడారు..ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
అతి త్వరలో కొత్త పార్టీ తో ప్రజల ముందుకు రావడానికి సిద్దమవుతున్న రజనీకాంత్ ఇటువంటి వివాదాస్పద కామెంట్స్ వెనుక ఓట్లు రాల్చుకునే వ్యూహం లాంటిది ఏమైనా ఉందా? అయితే, రజినీకాంత్ పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని. రజినీ చెప్పినట్టు 1971లో రజినీకాంత్ చెప్పినట్టుగా అలాంటి ర్యాలీ ఎక్కడ జరగలేదని.. జరగని సంఘటనకు అవాస్తవాలు జోడించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ పెరియార్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, రజినీకాంత్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని లేదంటే ఇంటిని ముట్టడిస్తామని ద్రవిడ సంఘాలు హెచ్చరించాయి.
అయితే ,మరోసారి దీనిపై స్పందించిన రజినీకాంత్ .. తన మాటలకు కట్టుబడి ఉన్నానని వెనక్కు తగ్గే సమస్య లేదని.. ఎన్ని ఆందోళనలు జరిగినా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.. దీంతో ద్రావిడ సంఘాలు పెరియార్ అభిమాన సంఘాలు రజినీకాంత్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. గతంలో తమిళనాట బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా గతంలో పెరియార్ రామస్వామి అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి. తమిళనాట ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అధికారంలోకి ఏ పార్టీ రావాలన్నా.. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసుకుని ఓట్లు సాధించి సీట్లు పొందుతున్నాయి.. ఇక తమిళనాట పాగా వేయాలని పావులు కదుపుతున్న బిజేపి సిద్దాంతాలు ద్రవిడ సిద్దాంతాలకు భిన్నంగా ఉంటాయి. అలాగే కొత్త పార్టీ పెట్టనున్న రజినీకాంత్ సిద్ధాంతాలు కూడా ద్రవిడ పార్టీలకు భిన్నంగా.. బిజెపి సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
అయితే , రజినీకాంత్ మాత్రం ప్రజలకు ఆధ్యాత్మిక పాలనను అందించే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. గతంలో బీజేపీ నేతలు.. తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట మెల్లగా ద్రావిడ వాదాన్ని మసకబార్చే దిశగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడే దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఇపుడు ద్రవిడ పార్టీల పుట్టుకకు ప్రేరణ అయిన పెరియార్ పై కామెంట్స్ రజనీ వైఖరి తన ఏమిటో ముందే చెప్తున్నారు అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడిప్పడే తమిళనాడులో రాజకీయాల్ని ముందుకు నడిపించింది ద్రవిడ వాదం.. కానీ కాల క్రమేణా ద్రవిడ పితామహుడు పెరియార్ రామస్వామి సిద్దాంతాలకు కనెక్ట్ కాని ఓటర్లు పెరిగిపోతున్నారు. పాత తరం ఓటర్లు ఇపుడు తగ్గారు. కాబట్టి రాబోయే రోజుల్లో క్రమేపీ దవిడ సిద్దాంతాల ప్రభావం రాజకీయాలపై ఉండదు.. ఆస్తికులను తమవైపు తిప్పుకోవడం.. పెరియార్ రామస్వామి సిద్ధాంతాలను కనుమరుగు చేయడం ద్వారా లబ్ధి పొందాలనేది అటు బీజేపీ ఇటు రజనీకాంత్ వ్యూహంగా ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే తమిళనాడు లో ఎవరిని ఎమన్నా కూడా పెద్దగా పట్టించుకోరు కానీ ,పెరియార్ రామస్వామి, అన్నాదురై, కామరాజ నాడర్ లను వారు దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. వీళ్ళను ఏమైనా అంటే మాత్రం తమిళనాడు ఆందోళనలతో అట్టుడికిపోతోంది. చూడాలి మరి ఈ పరిస్థితుల నుండి రజినీ , బీజేపీ ఎలా బయట పడుతుందో ...