Begin typing your search above and press return to search.

సీఎంకు ర‌జ‌నీ కాలా రిక్వెస్ట్‌!

By:  Tupaki Desk   |   6 Jun 2018 7:12 AM GMT
సీఎంకు ర‌జ‌నీ కాలా రిక్వెస్ట్‌!
X
ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. కావేరీ జ‌లాల విష‌యంలో త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క మ‌ధ్య న‌డుస్తున్న పంచాయితీ తెలిసిందే. ఈ ఇష్యూలో త‌మిళ‌నాడుకు మ‌ద్ద‌తు ప‌లికే ర‌జ‌నీ మూవీలు క‌ర్ణాట‌క‌లో ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌న్న వాద‌న ఒక‌టి బ‌లంగా వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే కొన్ని సంఘాలు ఇదే అంశాన్ని ప్ర‌చారం చేస్తున్నాయి. మామూలు స‌మ‌యాల్లో ఇలాంటి వాటి గురించి త‌ర్వాత చూద్దామ‌న్న‌ట్లుగా ఉంటారు.

కానీ.. త‌న తాజా మూవీ కాలా రిలీజ్ నేప‌థ్యంలో ర‌జ‌నీ రియాక్ట్ అయ్యారు. క‌ర్ణాట‌క‌లో త‌న కాలా మూవీ రిలీజ్ విష‌యంలో స‌హ‌కారం అందించాలంటూ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి ప్ర‌త్యేకంగా ఒక మెసేజ్ ను పెట్టారు. ఈ మెసేజ్ క‌న్న‌డంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. బుధ‌వారం ఉద‌యం ర‌జ‌నీ కుమార‌స్వామికి ప్ర‌త్యేకంగా మేసేజ్ పంపిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

త‌న సినిమాను ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్ల ద‌గ్గ‌ర భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. కాలా రిలీజ్ ను అడ్డుకోలేమ‌ని మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క హైకోర్టు క్లియ‌రెన్స్ ఇచ్చింది. అయితే.. థియేట‌ర్ల ద‌గ్గ‌ర భ‌ద్ర‌త విష‌యంలో ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో.. త‌న సినిమా విడుద‌ల‌కు ప్ర‌భుత్వ సాయం అవ‌స‌ర‌మ‌న్నది గుర్తించిన ర‌జ‌నీ ఈ ఉద‌యం సీఎం కుమార‌స్వామికి నేరుగా సెల్ సందేశాన్ని పంపారు.

ఎందుకిలా అంటే.. కోర్టు తీర్పు అనంత‌రం ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి చేసిన వ్యాఖ్య‌లే కార‌ణంగా చెబుతున్నారు. కాలా విడుద‌ల‌ను అడ్డుకోలేమ‌ని కోర్టు స్ప‌ష్టం చేస్తూ తీర్పు ఇచ్చిన అనంత‌రం.. ఈ అంశం మీద మాట్లాడిన సీఎం కుమార‌స్వామి.. "కోర్టు తీర్పును గౌర‌విస్తామ‌ని.. ప్రస్తుత ప‌రిస్థితుల్లో సినిమాను విడుద‌ల చేయ‌టం మంచిది కాద‌ని నిర్మాత‌ల‌కు.. పంపిణీదారుల‌కు సూచిస్తున్నా. ఒక పౌరునిగా.. క‌న్న‌డిగుడిగా చెబుతున్నా. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాలాతో అన‌వ‌స‌ర‌పు వివాదాలు తలెత్తుతాయి. ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత విడుద‌ల చేసుకుంటే మంచిది" అంటూ వ్యాఖ్యానించారు.

త‌న సినిమా విడుద‌ల‌పై ఇంత ఓపెన్ గా ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి మాట్లాడిన నేప‌థ్యంలో.. ర‌జ‌నీ సెల్ సందేశాన్ని పంప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో త‌మ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిని కించ‌ప‌రిచేలా చూపించిన‌ట్లుగా నాడార్ వ‌ర్గీయులు మండి ప‌డుతున్నారు. మొత్తంగా వివాదాల మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న కాలా ఏం చేస్తుందో చూడాలి. ర‌జ‌నీ క‌న్న‌డ సందేశం సీఎం కుమార‌స్వామి మ‌న‌సు మారుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.