Begin typing your search above and press return to search.

శాంతి కోసం ఎలాంటి పాత్రనైనా పోషిస్తా

By:  Tupaki Desk   |   2 March 2020 2:30 PM GMT
శాంతి కోసం ఎలాంటి పాత్రనైనా పోషిస్తా
X
తమిళనాడు రాజకీయాల్లోకి వస్తానని ఊరిస్తూ ఊరిస్తూ కాలం వెళ్లదీస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ దేశంలో జరుగుతున్న పరిణామాలపై తరచూ స్పందిస్తున్నారు. ఈ విధంగా ఇటీవల పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలిపారు. మద్దతు తెలుపుతూనే పరోక్షంగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశాడు. ఆ విధంగానే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఆయన స్పందించారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ఆయన స్పందిస్తూ శాంతి కోసం తాను ఎలాంటి పాత్రనైనా పోషిస్తానని ప్రకటించారు.

తాజాగా శని, ఆదివారం రజనీకాంత్ ను పలువురు ముస్లిం మత పెద్దలు కలిశారు. కాగా పౌరసత్వ చట్టం కారణంగా ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని, అలా ఏదైనా ఉంటే ముందుగా తానే వ్యతిరేకిస్తానని నటుడు రజనీకాంత్‌ పేర్కొన్నాడు. హజ్‌ కమిటీ అధ్యక్షుడు అబూబక్కర్‌ నటుడు రజనీకాంత్‌ను పోయెస్‌గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్ద కలిశారు. పౌరసత్వ చట్టంతో ముస్లింలకు ఎలాంటి బాధ ఉండదని రజనీకాంత్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ముస్లిం మత పెద్దలు రజనీకాంత్‌ను ఆయన ఇంటి వద్ద కలిశారు.

ఈశాన్య ఢిల్లీలో జరిగిన పరిణామాలను రజనీకాంత్ కు వివరించారు. అది తనను నొప్పించిందని చెప్పుకొచ్చారు. కాగా,ఢిల్లీలో చెలరేగిన హింస కారణం గా ఇప్పటి వరకు 24 మంది చనిపోగా.. 200 పైచిలుకు మంది గాయపడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో శాంతి, సామరస్యం పై తాను ముందుంటానని ప్రకటించారు. ఈ సందర్భం గా ఢిల్లీ అల్లర్లను ఆయన ఖండించారు. శాంతి పెంపొందించేందుకు తాను పని చేస్తానని తెలిపారు. ప్రేమ, సమైక్యత ప్రేమ నెలకొల్పడమే ప్రజల ఆకాంక్ష తొలి ప్రాధాన్యం అని తెలిపిన ముస్లింల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలని ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రకటించిన విషయం తెలిసిందే.