Begin typing your search above and press return to search.
ఏ సమస్యకి హింస పరిష్కారం కాదు : రజినీకాంత్
By: Tupaki Desk | 20 Dec 2019 6:01 AM GMTతాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసకి దారితీస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులకి ఆందోళన కారులు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
దీనిపై తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదన్నారు రజనీకాంత్ చెప్పారు. సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ (CAA) పై ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ర్యాలీలు - ఆందోళనలు - భారీ ప్రదర్శనలతో పాటు అనేక ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఏ సమస్యకి హింస పరిష్కార మార్గం కాకూడదని… జాతి - సమగ్రత - ఐక్యతని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా శాంతియుతంగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తోందని - ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని , సంయమనం పాటించాలి అని ఆందోళనకారులకి పిలుపునిచ్చారు.