Begin typing your search above and press return to search.
నెల్లూరులో కిల్లర్ ను పట్టించిన సూపర్ స్టార్ రజినీకాంత్
By: Tupaki Desk | 4 Jun 2019 8:35 AM GMTసినిమాల్లో హీరోగా నేరస్థుల పనిపట్టే రజినీ కాంత్ ఆంధ్రప్రదేశ్ లో ఓ కేసు పరిష్కారంలో పరోక్షంగా కీలకంగా వ్యవహరించడం ఆసక్తిగా మారింది. ఈ కేసుతో రజినీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం ఆయన ఫొటో ఆధారంగా కేసును పరిష్కరించారు పోలీసులు.
నెల్లూరులోని రామలింగపురంలో నివసిస్తున్న బొందిలి నిర్మలా బాయి (45) ఓ ప్రైవేటు స్కూల్లో క్లర్క్ గా పనిచేస్తున్నారు. ఆమె భర్త రమేశ్ సింగ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు. కుమారుడు బెంగళూరులో పనిచేస్తుండగా - కుమార్తె తిరుపతిలో చదువుకుంటోంది. దీంతో ఆమె నెల్లూరులో ఒంటరిగా జీవిస్తోంది. వారం రోజుల క్రితం నిర్మల హత్యకు గురైంది. కత్తితో ఆమెను పదిసార్లు పొడిచి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తగలబెట్టారు. ఆమె ఇంటి నుంచి మంటలు వస్తుండడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు.. నిర్మల ఇంటి సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. తమిళ సినీ నటుడు రజనీకాంత్ ఫ్లెక్సీతో ఉన్న ఓ ఆటో హత్యకు కొద్ది సమయం ముందు నిర్మల ఇంటి వద్దకు వచ్చి ఆగింది. హత్య తర్వాత ఆటో వెళ్లిపోయింది. క్లూ దొరికినట్టు భావించిన పోలీసులు రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కోసం గాలించారు. మొత్తంగా పదివేల ఆటోలను చెక్ చేశారు. ఎట్టకేలకు సోమవారం నగరంలోని అపోలో ఆసుపత్రి జంక్షన్ వద్ద రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కనిపించింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్ రామస్వామి అలియాస్ వేమసాని శ్రీకాంత్ - అలియాస్ రజనీకాంత్(22)ను అదుపులోకి తీసుకున్నారు. నిర్మలను తానే హత్య చేసినట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఆమెను చంపి బంగారు చైను - గాజులు - చెవి కమ్మలు - రూ.2వేల నగదును దోచుకున్నట్టు చెప్పాడు. అనంతరం ఇంట్లోని పాత పేపర్లను ఆమె మృతదేహంపై వేసి తగలబెట్టినట్టు చెప్పాడు.