Begin typing your search above and press return to search.
సిఏఏకి మద్దతు తెలిపిన సూపర్ స్టార్ !
By: Tupaki Desk | 5 Feb 2020 9:30 AM GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ చట్టంతో మైనార్టీల్లో ఆందోళనలు ఎక్కువౌతున్న సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సిఏఏ తన మద్దతు ప్రకటించారు. సీఏఏ వల్ల దేశంలో ఏ ఒక్క ముస్లింకి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని, ఒకవేల వారికీ ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజినీ హామీ ఇచ్చారు.
దేశ విభజన సమయంలో ఇండియాలోనే ఉండాలని ఈ దేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లిములను దేశం నుంచి ఎలా పంపివేస్తారని? అది అసాధ్యం అని , అదే విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్తుంది అని , కానీ కొన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడకోసమే ఈ విషయాన్నీ రాద్దాంతం చేస్తున్నాయని, రాజకీయ పార్టీల ముసుగు లో విద్యార్థులు పడకుండా తమ చదువుల పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
అలాగే ఇదే సమయంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) దేశానికి అవసరమని ఆయన చెప్పారు. దీనితో పాటుగా ఎన్ ఆర్ సి కూడా ముఖ్యమైనదే అని, బయటి వ్యక్తులను గుర్తించేందుకు ఇది చాలా ముఖ్యమైనదని తెలిపారు. దీనిపై ఆందోళన అవసరం లేదని, దీనిని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు అని రజినీ తెలిపారు. మొత్తంగా తమిళనాడు లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లో బరిలోకి దిగబోతున్న తలైవా ..మొట్టమొదటిసారిగా ఒక సున్నితమైన అంశం పై మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం విశేషం.