Begin typing your search above and press return to search.
రజనీ పార్టీ డేట్ ఎప్పుడంటే...
By: Tupaki Desk | 1 Jan 2018 7:01 AM GMTదేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తా.. అంటూ కొన్నేండ్లుగా అభిమానులతోపాటు అందరినీ ఉత్కంఠకు గురిచేసిన రజినీకాంత్ సందిగ్ధానికి తెరదించారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి నూతన సంవత్సర సంబురాలను రెట్టింపు చేశారు. పార్టీ పేరును ప్రకటించనప్పటికీ 2019 ఎన్నికలకు ముందే దాన్ని స్థాపిస్తానని - తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే...రజనీ పార్టీ ఎప్పుడు అనే ఆసక్తి అందరిలో నెలకొన్న సంగతి తెలిసిందే.
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసేందుకు పలు రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. సాంప్రదాయ పార్టీల ప్రయత్నాలకు తోడు కమల్ హాసన్ వంటి వ్యక్తుల రాజకీయ ప్రవేశ ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ తానూ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆరురోజులుగా అభిమానులతో భేటీ అవుతూవస్తున్న రజనీకాంత్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం కీలక ప్రకటన చేశారు. కులమతాలకు అతీతంగా పారదర్శకతతో కూడిన రాజకీయాలు కావాలి. అదే నా లక్ష్యం అని శుక్రవారం రజనీ అభిమానుల కోలాహలం మధ్య ప్రకటించారు. తెల్లటి కుర్తా - గుబురు గడ్డంతో ఆయన రెండు చేతులు జోడించి తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. తనది అధ్యాత్మిక రాజకీయంగా రజనీ పేర్కొన్నారు.
అభిమానులు తలైవాగా పిలుచుకునే రజనీకాంత్.. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. అసలు రజనీ వస్తారా రారా? దేవుడు శాసిస్తాడా? శాసించడా? అంటూ నిన్నటివరకూ సాగిన చర్చలకు బ్రేక్ పడి రజనీ పార్టీ పెడతానని ప్రకటించారు కానీ, అసలు ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్నదానిపై క్లారిటీ లేనేలేదు. దానిపైనా తొందర్లోనే రజనీ ప్రకటించే అవకాశం ఉంది. 2018 సంక్రాంతికి ఘనంగా రజనీకాంత్ కొత్త పార్టీని ప్రకటిస్తారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అభిమానులతో మంతనాలు పూర్తయ్యాక - ఓ క్లారిటీకి వచ్చిన రజనీ ఈ పొలిటికల్ సినిమాని జనవరి 14న ప్రారంభిస్తారన్న సంకేతాలందుతున్నాయి. రజనీకి సంబంధించిన సన్నిహితవర్గాలు దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చాయని తెలుస్తోంది.