Begin typing your search above and press return to search.
రజనీని రేపు దేవుడు ఆదేశిస్తాడట!
By: Tupaki Desk | 18 May 2017 6:22 AM GMTఏళ్లకు తరబడి తన రాజకీయ రంగప్రవేశంపై ఊరిస్తోన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటారా? మూడు రోజుల క్రితం తనకు తొందర లేదని.. దేవుడు ఆదేశిస్తే ఏం చేయటానికైనా సిద్ధమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆయన.. గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి అయ్యాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎనిమిదేళ్లుగా అభిమానుల్ని కలవని సూపర్ స్టార్.. తాజాగా చెన్నైలో నిర్వహిస్తున్న అభిమానుల దర్బార్ లో తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన కీలక ప్రకటనను.. చివరి రోజున వెల్లడించే అవకాశం ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
తన పొలిటికల్ ఎంట్రీ గురించి తానిక చెప్పాల్సిందేమీ లేదని.. తాను చెప్పాల్సిందంతా ఇప్పటికే చెప్పేశానని.. టైం వచ్చినప్పుడు చెబుతానంటూ చెప్పిన రజనీకాంత్ మాటల నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇప్పట్లో ఉండదన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. బుధవారం రాత్రి పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఫ్యాన్స్ తో కలిసి భేటీ కావటం రజనీకి కొత్త కాకున్నా.. ఈ తరహాలో గతంలో ఎప్పుడూ దర్బార్ నిర్వహించలేదన్న మాట వినిపిస్తోంది.
కొందరి రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. రజనీ తన పొలిటికల్ ఎంట్రీపై శుక్రవారం కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి మరీ.. ఆయన్ను రాజకీయ రంగప్రవేశం చేయాలని కోరినా ఓకే చెప్పని రజనీ.. ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంంలో ఎంట్రీ ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇప్పటికే చెప్పిన సూపర్ స్టార్ తన పొలిటికల్ ఎంట్రీ మీద శుక్రవారం ఖాయంగా సంచలన నిర్ణయాన్ని వెల్లడించే వీలుందంటున్నారు. వేరే పార్టీలో చేరే కన్నా.. సొంత పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా రజనీని దేవుడు ఆదేశిస్తాడో? లేక చివరి నిమిషంలో దేవుడు తన మనసు మార్చుకొంటారో అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/