Begin typing your search above and press return to search.
కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న'కబాలి'
By: Tupaki Desk | 7 Jun 2017 12:08 PM GMTతమిళనాడులో ప్రస్తుతం తలైవా పేరు మార్మోగుతోంది. కబాలి అక్కడి రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం చెన్నైలో అడుగుపెట్టనున్న సూపర్ స్టార్ ను కలవడానికి మీడియా సిద్ధంగా ఉంది. కొద్ది రోజుల క్రితం అభిమానులతో రజనీకాంత్ ఏర్పాటు చేసిన ఫొటో సెషన్ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ఆ సమయంలో రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 15 - 16వ తేదీల్లో చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో అభిమానుల తో మరోసారి ఫోటో సెషన్ ఏర్పాటు చేయనున్నారు. కన్యాకుమారి - అరియలూరు -దిండుగల్ - కరూర్ - తిరుచ్చి - తంజావూరు - తిరువరూర్ సహా 15 జిల్లాల అభిమానులతో మొదటి ఫొటో సెషన్ నిర్వహించారు. మిగిలిన 18 జిల్లాల అభిమానులతో రెండో ఫొటో సెషన్ నిర్వహించనున్నారు.
మొదటి సెషన్ లో తన వ్యాఖ్యలతో రజనీకాంత్ తమిళనాట వేడి పుట్టించారు. రాజకీయాల్లోకి రాబోతున్నానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రెండో ఫొటో సెషన్ లో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారోనని తమిళనాడు సహా దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తమిళనాడు ప్రజలకు రజనీ ఫివర్ పట్టుకుంది. అభిమానులందరూ ఆయన నామ స్మరణే చేస్తున్నారు. ఓ వైపు రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? ఏదైనా పార్టీకి మద్దతిస్తారా? అంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే రజనీకాంత్ మాత్రం ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. ఏదేమైనా తమ మద్దతు తలైవాకే ఉంటుందని అభిమానులు అంటున్నారు.
జూన్ 14వ తేదీన తమిళనాడు అసెంబ్లీ సమావేశం జరగనుంది. జూన్ 15వ తేదీన రజనీకాంత్ రెండో ఫోటో సెషన్ ప్రారంభం కానుంది. పళనిసామి ప్రభుత్వంలోని 24 మంది ఎమ్మెల్యేలు దినకరన్ వైపు జంప్ అయ్యారు. ఈ సందర్బంలోనే రజనీకాంత్ ఫొటో సెషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. స్థానికత నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని కొన్ని తమిళ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
దీంతో, ముంబై నుంచి రజనీకాంత్ చెన్నై తిరిగి వస్తున్న సందర్బంలో పోయెస్ గార్డెన్ లోని ఆయన ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/