Begin typing your search above and press return to search.
డీల్ పూర్తి...బీజేపీలో రజనీ పార్టీ విలీనం
By: Tupaki Desk | 9 Sep 2018 8:32 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ జర్నీపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లుగా కొద్దికాలం క్రితం వరకు ప్రకటనలు చేసినప్పటికీ...మునుపటి క్లారిటీ ఆయనలో లోపించిందా? పొలిటికల్ జర్నీ గురించి ఆశించిన స్థాయిలో దూకుడు కనిపించకపోవడం వెనుక వ్యూహం ఉందా లేదా పరిస్థితులే కారణమా? ఇది ప్రస్తుతం తమిళనాడు రాజకీయవర్గాల్లో చర్చనీయమైన అంశాలు. ఇప్పటికే పార్టీ పరమైన బ్యాక్ గ్రౌండ్ వర్క్ లో బిజీగా ఉన్న రజనీ తమిళనాడు అసెంబ్లీకి ఆర్నెల్లలో ఎన్నికలు వచ్చినా తాను ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజకీయ పార్టీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందని అంటున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు రజనీ సిద్ధం అవుతున్నారని వార్తలు వెలువడ్డాయి.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటనైతే చేశారు గానీ ఇంతవరకు ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా...వివిధ అంశాలపై ఆయన స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్ వచ్చిన సమయంలో రజనీ స్పందించకపోవడంతో కొత్త చర్చ మొదలైంది. తన పార్టీని కమళదళంలో విలీనం చేయనున్నారని అంటున్నారు. ఈ మేరకు రజనీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చర్చించినట్లు సమాచారం. దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న భారతీయ జనతాపార్టీ ఇందుకు రజనీకాంత్ ను అండగా చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. త్వరలో ఈ మేరకు ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారికంగా రజనీకాంత్ స్పందించలేదు.