Begin typing your search above and press return to search.
రజినీకి సొంత టీవీ ఛానల్..ఒకటి కాదు మూడు
By: Tupaki Desk | 21 Dec 2018 11:59 AM GMTవరసగా సినిమాలు చేస్తున్న రజినీకాంత్ - రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై మొన్నటి వరకు సందేహాలు ఉండేవి. రజిని మక్కల్ మందిరం అనే పేరుతో పార్టీని స్థాపించినా.. నిన్నా మొన్నటి వరకు పెద్దగా యాక్టివ్ గా లేదు. 2పాయింట్ 0 తరువాత రజిని రాజకీయాల్లో యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తోంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.అయితే రజినీకాంత్ పేరుతో ఓ టీవీ ఛానెల్ ప్రారంభం కాబోతుందనే విషయాన్ని రజనీ మక్కల్ మంద్రమ్ కన్వీనర్ వీఎం సుధాకర్ తెలిపారు. సూపర్ స్టార్ టీవీ - రజినీ టీవీ - తలైవర్ టీవీ ఇలా మూడు పేర్లతో ట్రేడ్ మార్కర్లని నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించామని సుధాకర్ అన్నారు.
తమిళుల ఆరాధ్యం జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్ - రజినీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే కమల్ తన పార్టీ పేరు ఎజెండా ప్రకటించగా, రజినీకాంత్ తన పార్టీకి ‘మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్ 31న ప్రకటించాడు రజనీ. పార్టీ నిర్మాణం రూపొందించే పూర్తి బాధ్యతని లైకా ప్రొడక్షన్స్ మాజీ అధినేత రాజు మహలింగం మరియు అభిమానుల సంఘం నాయకుడు సుధాకర్ కి రజనీకాంత్ అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ పరంపరలోనే ఆయన టీవీ ఛానల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు.
తమిళనాడులో ప్రతి పార్టీకి సొంతంగా ఒక ఛానల్ ఉంది. ఇదే బాటలో రజినీకాంత్ కూడా నడవబోతున్నాడు. రజినీకాంత్ పేరుమీద మూడు ఛానల్స్ రాబోతున్నాయి. రజినీకాంత్ టీవీ - సూపర్ స్టార్ టీవీ - తలైవా టీవీ. వీటికి సంబంధించిన లోగోలు కూడా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. రేపోమాపో దీనికి సంబంధించిన అధికారికమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ``రజినీ పేరు - లోగోలో ఆయన ఫోటో పెట్టడంపై రజినీకాంత్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. త్వరలోనే ఈ ఛానెల్ కి సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తాం`` అని సుధాకర్ స్పష్టం చేశారు. రజినీకాంత్ నటించిన పేటా సంక్రాంతికి రానుండగా,ఆ తర్వాత మురుగదాస్ తో తన 166వ సినిమా చేయనున్నాడు.