Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడు నెక్స్ట్ సీఎం త‌లైవానే!

By:  Tupaki Desk   |   29 April 2018 8:01 AM GMT
త‌మిళ‌నాడు నెక్స్ట్ సీఎం త‌లైవానే!
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం అక్క‌డ రాజ‌కీయ స‌మీకర‌ణాలు వేగంగా మారిపోయిన సంగతి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ లు త‌మ రాజ‌కీయ అరంగేట్రంపై క్లారిటీ ఇవ్వడంతో త‌మిళ‌నాడు రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోయింది. క‌మ‌ల్ త‌న పార్టీ పేరు, జెండా ప్ర‌క‌టించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్రియాశీల పాత్ర‌పోషించేందుకు సిద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు, ర‌జ‌నీ....త‌న పార్టీ పేరు, కార్య‌చ‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ సోద‌రుడు సీనియ‌ర్ న‌టుడు చారు హాస‌న్....సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడుకు కాబోయే ముఖ్య‌మంత్రి ర‌జ‌నీకాంతేన‌ని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం చారు హాస‌న్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఓ వైపు ర‌జనీ అభిమానులు....మ‌రోవైపు క‌మ‌ల్ అభిమానులు.....త‌మ హీరోల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ...వారిని సీఎం పీఠంలో చూసుకోవాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. త‌మ దారులు వేరైనా...ఒక‌రిపై ఒక‌రికి గౌర‌వం ఉంటుంద‌ని ఇద్దరూ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ సోద‌రుడు చారు హాస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు త‌ర్వాతి ముఖ్య‌మంత్రి త‌లైవానేన‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఈ విష‌యాన్ని చారు హాస‌న్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ర‌జ‌నీని క‌న్నడ వ్యక్తి అని కొంద‌రు విమ‌ర్శించార‌ని, వారంద‌రికీ తన విజయంతో ర‌జ‌నీ సమాధానం చెబుతార‌ని అన్నారు. త‌న సోద‌రుడు క‌మ‌ల్ క‌న్నా ర‌జ‌నీ సీఎం అయ్యే అవ‌కాశాలెక్కుగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కమల్ ను ప్రజలు గొప్ప నటుడిగా చూస్తారని, సినిమాల్లో క‌మ‌ల్ కు వ‌చ్చినంత మ‌ద్ద‌తు రాజకీయాల్లో రాక‌పోవ‌చ్చ‌ని అన్నారు. గ‌తంలో కూడా ర‌జ‌నీకి అనుకూలంగా చారు హాసన్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై క‌మ‌ల్ స్పంద‌న ఎలా ఉంటుద‌న్నది ఆస‌క్తికరంగా మారింది.