Begin typing your search above and press return to search.

హైదరాబాద్ శంషాబాద్ కు షాకిచ్చిన మూడీస్

By:  Tupaki Desk   |   13 Jun 2020 11:30 PM GMT
హైదరాబాద్ శంషాబాద్ కు షాకిచ్చిన మూడీస్
X
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు ఉంది. క్వాలిటీ, సేవల్లో ఎన్నోసార్లు ప్రపంచ ర్యాంకింగ్స్ లో మెరుగ్గా నిలిచింది. అయితే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి షాకిచ్చింది. ఎయిర్ పోర్టు రేటింగ్ ను బీఏ1 నుంచి బీఏ2కు తగ్గించింది.

ఇక ఇదే బాటలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ర్యాంకును కూడా బీఏ3కి తగ్గించింది. మార్చినెలలో ఈ రెండు ఎయిర్ పోర్టుల ర్యాంకింగ్స్ ను మూడీస్ రివ్యూకు పెట్టింది.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు ర్యాంకును తగ్గించడానికి గల కారణాన్ని కూడా మూడీస్ తెలిపింది. కరోనా వైరస్ పరిస్థితులతోపాటు ఆర్థికపరమైన సవాళ్ల నేపథ్యంలో రాబోయే రెండు , మూడేళ్లలో ఈ విమానాశ్రయాల ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉన్నందున రేటింగ్ ను తగ్గించినట్టు మూడీస్ సీనియర్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

లాక్ డౌన్ వల్ల విమానరాకపోకలు నిలిచిపోవడంతో రేటింగ్ పడిపోయింది. మే 25న దాదాపు రెండు నెలలకు విమానాలు పునరుద్ధరించడంతో ట్రాఫిక్ ను రేటింగ్ కోసం పరిగణలోకి తీసుకున్నట్టు మూడీస్ తెలిపింది.

కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని మూడీస్ పేర్కొంది. అనేక రంగాలు, మార్కెట్లు తీవ్ర కుదుపునకు లోను అయినట్టు తెలిపింది. ఇండియా విమానయాన రంగం దాదాపు 3.6 బిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్టు కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నారు.